గుమ్మడి నర్సయ్య… ఈ పేరు కి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంట! ఐదు సార్లు MLA గా గెలిచి, ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు! సర్పంచ్ గా తన పొలిటికల్ కెరీర్ ని మొదలు పెట్టిన గుమ్మడి గారు, ఆ తరవాత MLA గా ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు…
ఐతే ఇప్పుడు బియోపిక్స్ కాలం నడుస్తుంది కదా… అందుకే ఈ గొప్ప నాయకుడి బయోపిక్ కూడా చూడబోతున్నాం పెద్ద తెర పైన!

మరి గుమ్మడి నర్సయ్య గా నటించబోతున్నది ఎవరో తెలుసా??? ఇంకెవరు మన శివ రాజ్ కుమార్… నిన్ననే దీపావళి సందర్బంగా అనౌన్స్మెంట్ పోస్టర్ లాంచ్ చేసి సూపర్ అనిపించారు. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది…
అనౌన్స్మెంట్ పోస్టర్ లోనే సైకిల్ లో అసెంబ్లీ వస్తున్న గుమ్మడి గారిని చూసాం… ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సూపర్ గా ఉంది… సాధారణ పౌరుడి తరుపున నిలబడ్డ MLA గా సూపర్ గా ఉన్నారు శివ రాజ్ కుమార్!
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గుమ్మడి నర్సయ్య గా పర్ఫెక్ట్ గా సరిపోయారు… ఇద్దరు సింప్లిసిటీ కి మారుపేరు కదా అందుకేనేమో అలా పర్ఫెక్ట్ సింక్ అయ్యింది.
ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నది పరమేశ్వర్ హివ్రాలె… సినిమా తీయాలని ఉంటే సరిపోదు… గుమ్మడి గారితో అయన ప్రయాణం చేసి, వాళ్ళ కుటుంబం లో ఒకడిగా మారి, ఈ సినిమా తెస్తున్నాడు పరమేశ్వర్…
సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ విషయాలు త్వరలో తెలుస్తాయి…