దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ ద్వారా కొంతదూరం ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా, నిన్నటి రోజున ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన ద్రౌపది ముర్మును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఒక వయసు దాటిని మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధానం ద్వారానే తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు వేరు, భక్తి వేరని… దైవం ముందు అందరూ సమానమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Related Posts
శ్రీవారి వసతి గదుల ఖాళీల వివరాలు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి అనేది అత్యంత కీలకమైన అంశం. ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే ఆత్రుతతో దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు టీటీడీ…
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి అనేది అత్యంత కీలకమైన అంశం. ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే ఆత్రుతతో దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు టీటీడీ…
కంచి కామాక్షి ఐదు రూపాల గురించి మీకు తెలుసా?
కంచి అనగానే గుర్తుకు వచ్చే దేవత కామాక్షిదేవి. కంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కంచి కామాక్షిని దర్శించుకుంటారు. అయితే, అమ్మవారు ఆలయంలో ఐదు రూపాల్లో దర్శనం…
కంచి అనగానే గుర్తుకు వచ్చే దేవత కామాక్షిదేవి. కంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కంచి కామాక్షిని దర్శించుకుంటారు. అయితే, అమ్మవారు ఆలయంలో ఐదు రూపాల్లో దర్శనం…
Rewind 2026: ఈ ఏడాది బెస్ట్ అనిపించిన చిన్న సినిమా ఎదో తెలుసా???
2026 ఎండింగ్ కి చేరుకుంటున్న వేళ, ఎక్కువగా ‘Rewind ‘ ఆర్టికల్స్ అన్ని ఎక్కువగా భారీ క్యాస్ట్, భారీ బడ్జెట్ సినిమాల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ ఈ…
2026 ఎండింగ్ కి చేరుకుంటున్న వేళ, ఎక్కువగా ‘Rewind ‘ ఆర్టికల్స్ అన్ని ఎక్కువగా భారీ క్యాస్ట్, భారీ బడ్జెట్ సినిమాల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ ఈ…