దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ ద్వారా కొంతదూరం ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా, నిన్నటి రోజున ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన ద్రౌపది ముర్మును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఒక వయసు దాటిని మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధానం ద్వారానే తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు వేరు, భక్తి వేరని… దైవం ముందు అందరూ సమానమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Related Posts
కృష్ణం వందే జగద్గురుం పాట విన్నారా
శ్రీకృష్ణుడి పాటలు ఎన్నిసార్లు విన్నా పదేపదే వినాలనిపించే విధంగా ఉంటాయి. ఆయన భజనలు లీలలను తలపిస్తాయి. లీలా వినోదాన్ని అమృతంలా మనపై జొప్పిస్తాడు శ్రీకృష్ణుడు. ఆయన ఏం…
శ్రీకృష్ణుడి పాటలు ఎన్నిసార్లు విన్నా పదేపదే వినాలనిపించే విధంగా ఉంటాయి. ఆయన భజనలు లీలలను తలపిస్తాయి. లీలా వినోదాన్ని అమృతంలా మనపై జొప్పిస్తాడు శ్రీకృష్ణుడు. ఆయన ఏం…
Poll: ఫిట్నెస్ లక్ష్యాలకు మీరు ఎంత దూరంలో ఉన్నారు?
Post Views: 38
Post Views: 38
మోతమోగిపోతున్న OG ‘GUNS N ROSES’ సాంగ్…
ఆల్రెడీ సోషల్ మీడియా ని మిరాయి కలెక్షన్స్ ఊపేస్తున్నాయి… ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ OG వంతు కదా. ఎలానో సెప్టెంబర్ 25 న థియేటర్స్ లో…
ఆల్రెడీ సోషల్ మీడియా ని మిరాయి కలెక్షన్స్ ఊపేస్తున్నాయి… ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ OG వంతు కదా. ఎలానో సెప్టెంబర్ 25 న థియేటర్స్ లో…