అక్టోబర్ 25 కార్తీక చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోస్తారు. ఈ సంప్రదాయం అనాదికాలంగా వస్తోంది. ముఖ్యంగా స్త్రీలు రోజంతా ఉపవాసం ఉంటారు. అత్యంత భక్తి శ్రద్దలతో పాముపుట్టలో పాలు పోయడంతో పాటు, నాగుల విగ్రహాలకు కూడా పూజలు నిర్వహిస్తారు. నాగులను సుబ్రహ్మణ్యుడి రూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యుడు కాలసర్పదోషాలకు అధిపతి. ఆయన్ను ఆరాధించినవారికి ఈ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
అదేవిధంగా నాగులకు రాజుగా చెప్పబడే ఆదిశేషుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైన భక్తుడు. శేషసాయిగా, శేషతల్పంగా ఉంటాడు. నాగుల చవితిరోజున పుట్టలో పాలుపోసి చిమ్మిరిని నైవేద్యంగా సమర్పిస్తే ఆదిశేషుడు కూడా సంతోషిస్తాడని, తద్వారా భక్తులకు, వారి సంతానినిక ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటారని విశ్వాసం. ఈరోజు చేసే పూజలు ద్వాదశ నాగులైన అనంత, వాసుకి, శేష,పద్మనాభ, కంభళ, కర్కోటక,ఆశ్వతార,ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక,పింగళకు చేరుతాయని నమ్మకం.