ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటీమణులు చాలామంది ఉన్నా, వారికి తగినంత అవకాశాలు రావడం లేదని అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — తెలుగు నాయికల్లో చాలామంది ఇప్పుడు ఇతర భాషల్లో, ముఖ్యంగా తమిళ సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలు, గుర్తింపు పొందుతున్నారు. తమ సినీ ప్రయాణాన్ని తెలుగు సినిమాలతో మొదలుపెట్టినా, పెద్ద పేరును మాత్రం బయట భాషల్లో సంపాదిస్తున్నారు.
శ్రీ గౌరి ప్రియ

కాకినాడకు చెందిన ఈ నటి మొదట తెలుగు సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ ఆరంభించింది. Writer Padmabushan, MAD వంటి సినిమాలు ఆమెకు కొంత గుర్తింపును ఇచ్చాయి. కానీ ఆమెకు నిజమైన బ్రేక్ ఇచ్చింది మాత్రం గత సంవత్సరం వచ్చిన తమిళ చిత్రం LOVER. ఆ సినిమాతో తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అదేకాకుండా, ఆమె Modern Love Chennai అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె Bro Code అనే తమిళ కామెడీ డ్రామాలో నటిస్తోంది, ఇందులో రవి మోహన్ హీరోగా కనిపించనున్నాడు.
మేఘన

హైదరాబాద్‌కి చెందిన ఈ అందాల భామ Pushpaka Vimanam సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ తరువాత చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు ఇవ్వలేకపోయాయి. అయితే ఆమె చేసిన తమిళ సినిమా Kudumbasthan మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేకాకుండా ఆమె నటించిన Vizhi Veekura అనే తమిళ మ్యూజిక్ వీడియో వైరల్ అయ్యింది, దీని వలన ఆమెకు తమిళనాట విపరీతమైన క్రేజ్ వచ్చింది.
మానస

మానసా చౌదరి కూడా తెలుగు సినిమా Bubblegum ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ పెద్దగా అవకాశాలు రాకపోయినా, ఈ ఏడాది ఆమె నటించిన తమిళ సినిమా DNA మంచి ప్రారంభ గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన Aaryan అనే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 31న విడుదల కాబోతోంది.
ఈ instances చుస్తే తెలుగు నటీమణులు తమ భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ సినిమాలు వారికి కొత్త అవకాశాలు, విస్తృతమైన గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. అలా చూస్తే, ఈ తరం తెలుగు హీరోయిన్లు సౌత్ సినీ ప్రపంచంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తోంది.