శర్వానంద్ ని చుస్తే ఎందుకో మన పక్కింటి అబ్బాయి ని పెద్ద తెర మీద చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా… అందుకే తనంటే అంత ఇష్టం తెలుగు ప్రేక్షకులకు… ఐతే తన సినిమా థియేటర్స్ కి వచ్చి చాలా కాలం అయ్యింది… కానీ ఇప్పుడు ఆ లోటు తీరుస్తూ, బైకర్ సినిమా తో రెడీ గా ఉన్నాడు!
మన చార్మింగ్ స్టార్ శర్వానంద్… ఎప్పుడూ కొత్త పాత్రలు, కొత్త కథలు ఎంచుకునే హీరో. ఇప్పుడు మాత్రం మరొక హీరో ప్రపంచం – బైక్ రేసింగ్ లోకి అడుగు పెట్టాడు. ‘బైకర్’ సినిమాలో ఒక స్పోర్ట్స్‌మన్‌గా కనిపించనున్నాడు…
ఈ సినిమా టైం లైన్ 1990ల నుండి 2000ల మధ్య ఉండబోతోంది… మూడు తరాల ప్రేమ, కలలు, అంబిషన్స్ ఒకేసారి పరుగు తీసే కథ ఇది. స్పీడ్, ప్యాషన్, ఇమోషన్ — అన్నీ కలిసొచ్చే కథలా తెలుస్తోంది.
నవంబర్ 1న ఈ సినిమా ‘ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్’ విడుదల కానుంది. అది కూడా ఈ గ్లింప్స్‌ను బాహుబలి: ది ఎపిక్ ఇంకా మాస్ జాతర సినిమాలతో థియేటర్ లో స్ట్రీమ్ అవ్వనుంది!
ఇదివరకే వచ్చిన ఫస్ట్ లుక్‌లో రేసింగ్ సూట్‌లో శర్వా కనిపించాడు. కర్లీ హెయిర్, పవర్‌ఫుల్ అటిట్యూడ్ అన్ని సూపర్ గా ఉన్నాయ్!