అల్లరి నరేష్ ఎప్పుడు కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తూ ఉంటాడు… కామెడీ హీరో గా ఉన్నపుడైన, లేకపోతె ఇప్పుడు కమర్షియల్ సినిమాలైనా మంచి కాన్సెప్ట్స్ చేస్తాడు. మారేడుమిల్లి, నాంది, ఇలా మంచి సినిమాలు చేసాడు…
ఇప్పుడు మళ్ళి లేటెస్ట్ గా ’12A రైల్వే కాలనీ’ తో మన ముందుకు రాబోతున్నాడు… రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు టీం. లేటెస్ట్ గా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ “కన్నోదిలి కలనొదిలి…” లిరికల్ వీడియో రిలీజ్ చేసి మంచి మెలోడీ తో ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.
ఈ పాటలో అల్లరి నరేష్ తన ప్రేమను హీరోయిన్ కి తెలియజేసే పనిలో ఉంటాడు… డెవ్ పవర్ రాసిన లిరిక్స్, భీమ్స్ మ్యూజిక్ ఇంకా హేశామ్ అబ్దుల్ వహాబ్ వాయిస్ సాంగ్ ని వెంటనే ప్లేయలిస్ట్స్ లో చేర్చింది…
ఈ సినిమా ని పోలిమేర సిరీస్‌తో పెద్ద పేరు తెచ్చుకున్న డాక్టర్ విశ్వనాథ్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన షోరన్నర్.
ఇప్పటికే షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా, సినిమా నవంబర్ 21న విడుదల కానుంది.