ప్రతి నెలా సోషల్ మీడియా లో ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. కానీ నవంబర్ వచ్చేసరికి ఇంటర్నెట్ మొత్తం NNN – No Nut November అనే ట్రెండ్‌తో కిక్కిరిసిపోతుంది. మొదట్లో ఇది కేవలం ఫన్నీ మీమ్స్‌గా మొదలైనా, ఇప్పుడు చాలామంది దీన్ని సెల్ఫ్ కంట్రోల్ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు.
NNN అంటే ఏమిటి?
ఇది ఒక నెలపాటు హస్తప్రయోగం లేదా శృంగార చర్యలకు దూరంగా ఉండే ఛాలెంజ్. అంటే, ఈ నెలలో మనసు, శరీరాన్ని నియంత్రించుకోవడమే లక్ష్యం. ఈ ఛాలెంజ్‌ను ఫాలో అయ్యేవారు తమపై నియంత్రణను పెంచుకోవడం ద్వారా డీటాక్స్ అనుభూతి పొందుతారని చెబుతున్నారు.
NNN వల్ల లాభాలు ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వ్రతం లేదా కంట్రోల్ మానసికంగా శక్తినిచ్చే సాధనలా పనిచేస్తుంది. దీని వల్ల సెల్ఫ్ డిసిప్లిన్, ఫోకస్, కాన్ఫిడెన్స్, మానసిక స్థైర్యం పెరుగుతాయి. శారీరకంగా కూడా ఎనర్జీ లెవెల్స్ మెరుగవుతాయని కొందరు నమ్మకం. రిలేషన్‌షిప్స్‌లో కూడా ఫిజికల్ అట్రాక్షన్ కన్నా ఎమోషనల్ బాండింగ్ విలువ పెరుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
NNN తర్వాత ఏమిటి DDD?
నవంబర్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో DDD – Destroy Dick December అనే ఫన్నీ కాంట్రాస్ట్ ట్రెండ్ కూడా వస్తుంది. కానీ చాలామంది NNNను కేవలం సరదా ట్రెండ్‌గా కాకుండా, సెల్ఫ్ కంట్రోల్ ట్రైనింగ్‌గా తీసుకోవడం ప్రారంభించారు.