అబ్బా అబ్బా ఎమన్నా ప్రొమోషన్స్ ఆ… అది కూడా సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందే… జక్కన్న నీకు సాటి ఎవరు లేరయ్యా… SSMB 29 టైటిల్ ఏంటి అని అందరం బుర్రలు పాలగొట్టుకుంటున్నారు కదా. ఇంకో కొన్ని రోజులు లాగండి… ఈ నెల లోనే ఈ సినిమా టైటిల్ రివీల్ అవుతుంది.

ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్ అంటే దేశం మాత్రమే కాదు… ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది ఈ సినిమా కోసం. నెలల తరబడి విదేశాల్లో షూట్ జరుపుతున్న ఈ గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్‌పై ఇప్పటి వరకు ఒక్క పోస్టర్, టీజర్ కూడా రాలేదు.

కానీ ఇక వేచి చూసే రోజులు దాదాపు ముగిసినట్లే. నవంబర్ 15న హైదరాబాద్‌లో ఇండియా సినిమాల చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో గ్రాండ్ రివీల్ ఈవెంట్ ప్లాన్ చేస్తారని టాక్. #Globetrotter గా, లేదా SSMB29 గా పిలుస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఆ రోజే విడుదల కానుంది.
అందుకే నిన్న రాత్రి… నవంబర్ మొదటి రోజునే మహేష్ బాబు సరదాగా రాజమౌళిని ట్యాగ్ చేస్తూ “It’s November already @ssrajamouli 👀” అంటూ సోషల్ మీడియా లో హంగామా మొదలెట్టాడు.
వెంటనే రాజమౌళి, ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఆ చిట్ చాట్‌లో చేరడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సరదా సంభాషణతో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా, పృథ్విరాజ్ విలన్‌గా ఉన్నట్టు క్లారిటీ వచ్చింది. త్వరలోనే వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు, తరువాత మహేష్ బాబు లుక్ బయటకు రానున్నట్టు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.



అంతేకాదు, ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ఫైనల్ అయిందని కూడా టాక్ వినిపిస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌కు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ సమకూరస్తున్నారు. 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారత సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లబోతోంది ఈ థండర్ ప్రాజెక్ట్!