Area 51 గురించి ప్రపంచానికి తెలియని విషయాలు

Area 51 Hidden secrets scaled

ఏరియా 51 (Area 51) అనేది అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న ఒక అత్యంత రహస్యమైన మిలిటరీ స్థావరం. ఇది యూఎస్ గవర్నమెంట్ అధికారికంగా అంగీకరించిన ప్రదేశం అయినా, దాని గురించి చాలా విషయాలు ఇప్పటికీ రహస్యంగా ఉన్నాయి. ఇక్కడ ప్రపంచానికి ఎక్కువగా తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి

ఏరియా 51 ప్రధానంగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్. ఇది కొత్త రకాల విమానాలు, డ్రోన్లు, టెక్నాలజీలను పరీక్షించేందుకు ఉపయోగిస్తారు. చాలా గోప్యంగా రూపొందించిన U-2 స్పై ప్లేన్, SR-71 బ్లాక్‌బర్డ్, F-117 నైట్‌హాక్ స్టెల్త్ ఫైటర్ మొదటిగా ఇక్కడే పరీక్షించబడ్డాయి.

ఎలియన్లను, UFOలను కవర్ చేసే జాగ్రత్తలు, ప్రచారాలు ఈ ప్రదేశాన్ని మిస్టీరియస్‌గా మార్చాయి. 1947 రోస్వెల్ ఘటన తర్వాత, చాలా మంది నమ్మకం ప్రకారం ఏరియా 51లో ఏలియన్లు, వారి విమానాలు, టెక్నాలజీని స్టోర్ చేసి ఉంటారని నమ్ముతున్నారు.

ఏరియా 51లోకి ఎవరికీ అనుమతి లేదు. సామాన్యులు ఎవరూ ఏరియా 51 వైపుకు వచ్చేందుకు అనుమతి లేదు. ప్రైవేట్‌ సెక్యూరిటీ నిత్యం అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటుంది. వీరిని కామోడూడ్స్‌ అంటారు. ఈ ప్రాంతంలోనే గ్రూమ్‌ లేక్‌ ఉంటుంది. దీనినే డ్రై లేక్‌ అని కూడా అంటారు. ఇక్కడికి కూడా ప్రజలెవ్వరినీ రానివ్వరు.

ఏరియా 51 లో పనిచేసే ఉద్యోగులను తీసుకొచ్చి తీసుకుపోయే విమానాలను JANET అనే పేరుతో పిలుస్తారు. లాస్‌వేగాస్‌ నుంచి ఈ విమానాలు నేరుగా ఏరియా 51లోకి ప్రవేశిస్తాయి. JANET అంటే Just Another Non-Existent Terminal అని చెబుతుంటారు.

అంతరిక్షం నుంచి ఏరియా 51 ప్రాంతాన్ని మ్యాపింగ్‌ చేయడం కూడా కష్టమే. ఈ భాగంలోకి శాటిలైట్‌లు వెళ్లినా అక్కడి వాటిని ఫొటోలుగా తీయడం సాధ్యం కాదని అంటారు. ఒకవేళ ఫొటోలు తీసినా ఫిక్సలేట్‌ అవుతాయి.

ఇటీవల నెవెడా ప్రాంతంలోని ఏరియా 51లో గూగుల్‌ ఎర్త్‌ మ్యాపింగ్‌ తీసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఏరియా 51లో ఎత్తైన బహుళ అంతస్తుల భవంతి ఒకటి దర్శనం ఇచ్చింది. ఈ భవంతి చూసేందుకు రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ లా ఉండటంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. స్టెల్త్ విమానాలు పరీక్షించేందుకు లేదా ఉపగ్రహాలను ప్రయోగించే స్టేషన్‌ పేరుతో ఉపగ్రహాలను బురిడీ కొట్టించేందుకు ఏర్పాటు చేసిన కట్టడం అని కొందరి అనుమానం.

1955లో నెవెడా ఎడారిలో 200 కిలోమీటర్ల పరిధిలో ఏరియా 51 ఏర్పాటు చేశారు. ఇక్కడ సైనికులకు శిక్షణ ఇస్తారు. రహస్య జెట్‌ విమానాలను పరీక్షిస్తారు. మోషన్‌ సెన్సార్ల ఏర్పాటుతో ఉపగ్రహ ఛాయాచిత్రాలనుంచి ఈ ప్రాంతం కాపాడబడుతున్నది.

ఏరియా 51కి గతంలో “Paradise Ranch”, “Watertown Strip”, “Dreamland”, “Homey Airport” వంటి పలు రకాలైన కోడ్‌ భాషల్లో పిలిచేవారు.

ఏరియా 51లో అనేక “Black Projects” చేపడుతుంటారు. ఈ ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే బడ్జెట్‌, ప్రాజెక్టుల ఉద్దేశం ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. దీనికి ఎంత ఖర్చు చేస్తారు అన్నది యూఎస్‌ కాంగ్రెస్‌లో కూడా చర్చకు రాదు. ఎంతైన ఖర్చు చేసేందుకు అమెరికా ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంటుంది.

2013వరకు అమెరికా ప్రభుత్వం ఏరియా 51ని అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే, 2013లో తొలిసారి సీఐఏ ఏరియా 51 గురించి ప్రపంచానికి తెలియజేసింది. గోప్యంగా రహస్యంగా ప్రయోగాలు చేసేందుకు ఏరియా 51 ఉన్నట్టుగా తెలియజేసింది.

ఏరియా 51 రహస్యాన్ని బేస్‌ చేసుకొని ఇండిపెండెన్స్‌ డే, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ బ్లాక్‌ ఆప్స్‌, ది ఎక్స్‌ ప్లైస్‌ అనే సినిమాలు, వీడియో గేమ్స్‌, సీరిస్‌లు వచ్చాయి.

బాబ్‌లాజర్‌ అనే ఇంజనీర్‌ 1989లో ఓ టీవీ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెలువరించారు. ఎస్‌ 4 అనే రహస్య ప్రాంతంలో ఏలియన్‌ విమానాన్ని రివర్స్‌ ఇంజనీరింగ్‌ కోసం పనిచేశానని చెప్పాడు. మన దగ్గర ఉన్న విమానాల కంటే ఎలియన్స్‌ ప్రయాణం చేసే యూఎఫ్‌ఓ విమానాలు అత్యంత శక్తివంతమైనవి. వాటి టెక్నాలజీని అర్థం చేసుకోవం దాదాపుగా అసాధ్యం.

Read More

Vakkaya చెబుతున్న ఆరోగ్య రహస్యాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *