ఇటీవలి రోజులలో దీపికా పడుకోనే తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కారణం… కొన్ని నెలల క్రితమే సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ Spirit నుండి ఆమె తప్పుకుంది. ఆ తరువాత, మొదటి భాగంలో కీలక పాత్ర చేసినప్పటికీ Kalki 2 నుంచి కూడా వైదొలిగింది.

ఇలా వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు దీపికా మాట్లాడిన మాటలు నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. “₹500 – ₹600 కోట్ల సినిమాలు ఇప్పుడు నన్ను ఎక్సైట్ చేయవు… ఇక నేను ఇతర టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నా” అని ఆమె చెప్పింది. దీనిపైన నెటిజెన్లు “అలా అయితే మొదట సైన్ ఎందుకు చేసింది? ఇప్పుడు మాట మార్చడం ఎందుకు?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

Harper’s Bazaar India కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా ఇలా అన్నారు:
“ఇంకా ఎంత ఫేమ్? ఇంకా ఎంత సక్సెస్? ఎంత డబ్బు? ఇప్పుడు నాకు ఇవి అంత ముఖ్యమేమీ కావు. ₹100 కోట్లు, ₹500–₹600 కోట్ల సినిమా అనే లెక్కలు కూడా ఇప్పుడు నాకు ఎక్సైట్ ఇవ్వవు. నేను ఇప్పుడు కథలు చెప్పడంపై, అద్భుతమైన రైటర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులను ఎదగనివ్వడంపై ఫోకస్ చేస్తున్నా.”
కానీ ఆమె స్టేట్మెంట్స్ కి వెంటనే సోషల్ మీడియాలో కౌంటర్లు రావడం మొదలయ్యాయి.
“అలా అయితే షారుఖ్ ఖాన్ ఘనంగా చేస్తున్న King లో ఎందుకు నటిస్తోంది?”
“Allu Arjun – Atlee భారీ పాన్ ఇండియా సినిమాను ఎందుకు అంగీకరిస్తోంది?”
“Spirit, Kalki మొదట సైన్ చేసినప్పుడు ఈ ఫిలాసఫీ కనిపించలేదా?”
అంటూ నెటిజెన్లు ఆమె మాటలు, చర్యలు మ్యాచ్ కావడం లేదని పేర్కొంటున్నారు.
దీపికా పెద్ద బడ్జెట్ సినిమాలను వదిలేస్తానంటూ చెబుతున్న ఈ దశలో, ఆమె తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు మళ్లీ కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి…