అనంతమైన సంపద కలిగిన అనంతపద్మనాభుని ఆలయంలో అడుగడుగున రహస్యాలే. అనంతుని సంపద బయటపడిన తరువాత ఒక్కొక్క రహస్యం బయటకు వస్తోంది. శ్రీమహావిష్ణువు శయనరూపుడై స్వయంగా వెలిసిన క్షేత్రం పద్మనాభుని ఆలయం. ఇక్కడ స్వామివారు స్వయంభూవుగా వెలియడానికి ప్రధాన కారణం దివాకరముని అని అనంతశయన మహత్య గ్రంథం చెబుతున్నది. మునిని పరీక్షించేందుకు బాలుని రూపంలో ఆవిర్భవించిన మహావిష్ణువు… ముని వద్ద ఉంటూ అల్లరి చేసేవాడు. ఆ అల్లరిని భరించలేక ముని ఆగ్రహం వ్యక్తం చేయడంతో… బాలుడు అదృశ్యమై తాను అనంతన్కాడు వద్ద ఉంటానని చెప్పడంతో ముని స్వామివారిని వెతుక్కుంటూ వెళ్తాడు.
రాంచిలో సఫారీలను మట్టికరిపించిన భారత్
అలా ఆ మునికి దర్శనం ఇచ్చిన రూపమే అనంతపద్మనాభుడు. కేరళ తిరువనంతపురం ప్రాంతాన్ని పరిపాలించిన ట్రావెన్కోర్ రాజులు స్వామివారికి దాసులుగానే ఉన్నారు. స్వామివారికి అనంతమైన సంపదను ఇచ్చి వాటిని కాపాడుతూ వచ్చారు. అనంతపద్మనాభుని ఆలయం వైష్ణవాలయమైనా..శివకేశవులకు అబేధం లేదని చెప్పడానికి ఇక్కడ ఆలయంలో మహాశివుని ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడి నేలమాళిగలోని గదుల్లో అపారమైన సంపద ఉండగా, ఇందులోని ఆరు గదులను తెరిచి అందులోని అంతులేని సంపదను లెక్కించారు. అయితే, ఏడో గదికి నాగబంధం వేసి ఉండటంతో, దానిని తెరిచేందుకు ఎవరూ సాహసించడం లేదు. తలుపుకు ముట్టుకుంటే సముద్రఘోష పెరిగిపోతున్నదని, ఆ గదిలో అపారమైన సంపద లేదా దైవశక్తి నిక్షిప్తమై ఉండొచ్చని అంటున్నారు.