అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మీద ఎలాంటి బజ్ ఉందొ మన అందరికి తెలిసిందే కదా… ఇక ఈ సినిమా సంక్రాంతి కె థియేటర్స్ లోకి రాబోతోంది కాబట్టి, ప్రమోషన్స్ గట్టిగా మొదలు పెట్టారు. ఆల్రెడీ మీసాల పిల్ల సింగ్ అదిరిపోయింది… ఇక ఇప్పుడు “శశిరేఖ…” సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేసారు…
ఇందులో చిరు – నయన్ ట్రెడిషనల్ లుక్‌లలో కనిపిస్తూ, రెండు బోట్స్ మీద అందంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ మత్తెకించారు. భీమ్స్ మ్యూజిక్, అతని వోకల్స్ తో పాటు మధుప్రియ గాత్రం కలవడంతో ఓ లైవ్లీ, ఫీల్–గుడ్ రిథమ్ అప్పుడే ట్రేండింగ్ లోకి వెళ్ళిపోయింది!
ఇది ప్రోమో మాత్రమే…ఇంక రెండు రోజుల్లో ఫుల్ సాంగ్ రాబోతుండటంతో ఆసక్తి మిన్నంటుతోంది. సో, 8th డిసెంబర్ వరకు వెయిట్ చేయక తప్పదు!
సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి, సంక్రాంతి 2026కి మెగాస్టార్ మరో థియేట్రికల్ సెలబ్రేషన్ రెడీ అవుతోంది.