Native Async

మలయాళ స్టార్ హీరో దిలీప్ రిలీజ్…

Dileep Acquitted: Court Clears Malayalam Actor of All Charges in 2017 Actress Assault Case
Spread the love

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత వివాదాస్పదమైన కేసుల్లో ఒకటి… మలయాళ స్టార్ హీరో దిలీప్ పై 2017లో నమోదైన అత్యాచార కేసు. కొన్నేళ్ల క్రితం ఒక మలయాళీ నటిని కిడ్నాప్ చేసి, శారీరకంగా–మానసికంగా వేధించారని, ఈ సంఘటనలో దిలీప్ కూడా భాగస్వామినని ఆరొపణలు వచ్చాయి. ఈ కేసు ఎనిమిదేళ్లుగా కోర్టుల్లో ఉండగా… చివరికి ఈరోజు ఉదయం ఫైనల్ తీర్పు వెలువడింది. కానీ ఈ తీర్పు అందరిని షాక్ కి గురిచేసింది!

దిలీప్‌కు కోర్టులో పెద్ద ఉపశమనం:
ఎర్నాకులం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు (A8)గా ఉన్న నటుడు దిలీప్‌ను ఆరు కేసుల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. రేప్ కేసు, ఫిజికల్ అబ్యూస్, కుట్ర… ఇలా అతనిపై ఉన్న అన్ని ఆరోపణలకు సంబంధించి తగిన సాక్షాలు సమర్పించలేకపోవడంతో కోర్టు అతన్ని పూర్తిగా విముక్తి చేసింది. ఈ తీర్పు ని జడ్జ్ హనీ ఎం. వర్గీస్ గారు ఓపెన్ కోర్టులో ప్రకటించారు.

‘ఇది నాపై చేసిన కుట్ర’ — దిలీప్ రియాక్షన్:
ఇక తీర్పు వెలువడిన వెంటనే స్పందించిన దిలీప్, “ఈ మొత్తం కేసు నాపై వేసిన కుట్రే… నిజం చివరికి గెలిచింది” అని చెప్పాడు.

ఇలా 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు, ఏళ్ళ తరబడి మీడియా, సినీ వర్గాల్లో చర్చకు గురైన ఈ కేసు ఈరోజు అనుకోని ముగింపు చూసింది! ఇప్పుడు తీర్పు బయటకు రావడంతో, మలయాళ ఇండస్ట్రీ మొత్తంలో కూడా పెద్ద చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit