అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, తన భార్య ప్రీతి అదానీతో కలిసి అహ్మదాబాద్‌లోని జైన దేవాలయాన్ని ఆదివారం దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొన్ని నెలలుగా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా కొనసాగిన వివాదాలు, అనుమానాల మధ్య తాజాగా సెబీ (SEBI) అదానీ గ్రూప్‌కు పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చింది.
ఆలయంలో అదానీ దంపతులు ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఒకే ఒక్క దీపం వెలిగించి, మౌన ప్రార్థన చేశారు. ఈ సందర్భంలో అదానీకి అత్యంత సహచరలు మీడియాకు తెలిపిన మాటలు ఎంతో ప్రాధాన్యంగా నిలిచాయి. “హిండెన్‌బర్గ్ తుఫాన్ తర్వాత, ఎన్నో అనుమానాలు, గాసిప్స్ నడుమ వచ్చిన ఈ నిర్ణయం అదానీకి కేవలం చట్టపరమైన ఉపశమనం మాత్రమే కాదు. ఇది ధర్మంపై అధర్మం ఓడిన సంకేతం, విశ్వాసం, పట్టుదల, ధైర్యం గెలిచిన ప్రతీక” అని పేర్కొన్నారు.
అదానీ కుటుంబానికి ఇది విజయోత్సవ క్షణం అయినా, వారు దీన్ని వేడుకగా కాకుండా కృతజ్ఞతా క్షణంగా మలచుకున్నారు. శబ్దం లేకుండా, మీడియా హడావిడి లేకుండా, ఓ పావనమైన ధార్మిక వాతావరణంలో వారు తాము పొందిన ఉపశమనం కోసం దేవుడికి ధన్యవాదాలు తెలిపారు.
గౌతమ్ అదానీ వ్యాపార ప్రపంచంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, విశ్వాసం, సహనం, పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన ఈ చర్య ద్వారా తన కుటుంబం, తన గ్రూప్ వెనుక ఉన్న విలువలు, నైతికతలను స్పష్టంగా తెలియజేశారు.
అదానీకి ఈ విజయమే కాదు, అది ఆధ్యాత్మికతతో ముడిపడిన క్షణం కూడా. వ్యాపారంలో గెలుపు అనేది కేవలం ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాదు, దానికి వెనుక ఉన్న విశ్వాసం, నైతికత, దేవుని మీద ఉన్న భక్తి కూడా అంతే ముఖ్యమని ఈ చర్య ద్వారా ఆయన నిరూపించారు. వ్యాపారంలో భగవంతుడిని నమ్మితే తప్పకుండా విజయం లభిస్తుందని, ఒడిదుడుకులు ఎదురైనా ఆ భగవంతుడే కాపాడుతాడని ఆదాని కుటుంబసభ్యులు తెలియజేశారు.