నిజంగా చెప్పాలంటే… OTT ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఒక కొత్త డీల్ తో మళ్ళి వార్తల్లోకి ఎక్కింది. చాలా నెలలుగా వార్తల్లో వినిపిస్తున్న ఆ భారీ డీల్… ఇవాళ అధికారికంగా ప్రకటించబడింది.
నెట్‌ఫ్లిక్స్ కంపెనీ, Warner Bros. Discovery (WBD) తో ఒక డెఫినిటివ్ అగ్రిమెంట్ పై సైన్ చేసింది. దీనితో Warner Bros మొత్తం—Film Studios, TV Studios, HBO, HBO Max అన్ని నెట్‌ఫ్లిక్స్ ఆధ్వర్యంలోకి వస్తాయి!
ఈ డీల్ విలువ ఎంతంటే… ఒక్క WBD షేర్ కు $27.75. మొత్తం డీల్ విలువ ఏకంగా $82.7 బిలియన్లు, అంటే భారత రూపాయలలో దాదాపు ₹8 లక్షల కోట్లు! ఇదేంటో అర్థం చేసుకోండి… ప్రపంచ ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీ చరిత్రలోనే అతి పెద్ద డీల్ ఇది.
కొన్ని నెలలుగా ఈ డీల్ పై ఎన్నో సందేహాలు… సరైన సమాచారం వస్తుందా? ఒప్పందం పూర్తవుతుందా? అన్న చర్చలు జరిగాయి. చివరకు ఇవాళ రెండు కంపెనీలు అన్ని నిబంధనలపై అంగీకరించి డీల్‌ను అధికారికంగా ప్రకటించాయి.
ఇక అసలు ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే: ఇంతవరకు OTTలో తన దుమ్ముదులిపిన నెట్‌ఫ్లిక్స్… ఇప్పుడు Warner Bros లేబుల్ ద్వారా థియేట్రికల్ సినిమా ప్రొడక్షన్‌లోనూ అడుగు పెడుతోంది! ఇది హాలీవుడ్ కల్చర్ కి, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీకి ఏ విధమైన ప్రభావం చూపుతుందో… ఎలాంటి కొత్త మార్పులు వస్తాయో… ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తోంది.