పాన్–ఆధార్ లింక్ చేసుకునే గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసిన నేపథ్యంలో, జనవరి 1, 2026 నుంచి ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు డీయాక్టివేట్ చేయబడతాయి. అందువల్ల ప్రతి పాన్ కార్డు హోల్డర్ తన పాన్ యాక్టివ్ స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవడం అవసరం. ఇందుకోసం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్‌లో “Verify PAN Status” ఆప్షన్ ద్వారా పాన్ నంబర్, పేరు, జన్మతేది, లింక్ చేసిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫికేషన్ పూర్తి చేస్తే వెంటనే పాన్ స్టేటస్ తెలుస్తుంది.
ఒకవేళ ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్ల పాన్ డీయాక్టివేట్ అయి ఉంటే, అదే పోర్టల్‌లోని “Link Aadhaar” ఆప్షన్ ద్వారా పాన్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేసి మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అవసరమైతే ‘e-Pay Tax’ ద్వారా రూ.1000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆధార్–పాన్ లింక్ స్టేటస్ 30 రోజుల్లో పూర్తవుతుంది. అయితే అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల నివాసితులు, NRIలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, భారత పౌరులు కాని వ్యక్తులకు ఈ లింక్ ప్రక్రియ తప్పనిసరి కాదు. మిగతా వారందరూ తమ పాన్ కార్డు యాక్టివ్‌గా ఉండేలా వెంటనే ఆధార్‌తో లింక్ చేసుకోవడం ఆర్థిక లావాదేవీలకు ఎంతో కీలకం.