తుమ్మిపువ్వులు గడ్డిజాతికి చెందిన మొక్కలు. సాధారణంగా ఇవి రోడ్డు పక్కన, పొలం గట్లమీద పెరుగుతుంటాయి. వీటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఈ పువ్వులు మహాశివుడిని అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు. ఈ తుమ్మి పువ్వులను భూతనాశక అని పురాణాలు చెబుతున్నాయి. ఇది చెడు శక్తులను తొలగించే శక్తి కలిగి ఉందని విశ్వాసం. ఈ పువ్వుల పేరుమీదగానే శివుడిని భూతనాధుడు అని పిలుస్తారు. భూతగణాలకు ఆయన అధిపతి. తుమ్మి పువ్వులు భూతగణాలను ప్రసన్నం చేస్తాయని, అందువలన శివుడి ఆరాధనలో వీటిని ఉపయోగిస్తారు. తుమ్మిచెట్టు శరీరాన్ని శుద్ధి చేసే తత్వాన్ని, రోగనాశనం చేసే గుణాలను కలిగి ఉంటుంది. మహాశివుడు శుద్దతకు ప్రతీక. అందుకే ఈ పువ్వులు శివారాధనలో తప్పకుండా ఉపయోగించాలని అంటారు. శివుని పూజలు తుమ్మి పువ్వులను సమర్పించడం వలన దోషాలు తొలగిపోతాయి. చేసిన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. అలంకరణ తత్వం లేని భగవంతుడు మహాశివుడు. అందుకే చిన్నదైన, సాధారణమైన తుమ్మిపువ్వును మహాశివుడిని శ్రద్ధతో సమర్పిస్తే ఆయన తృప్తి చెందుతారని, భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ఒక్క తుమ్మిపువ్వుతో శివుడిని పూజిస్తే సహస్ర పుష్పార్చన చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Related Posts
Venkatesh Wrapped Up Megastar’s ‘Mana Shankara Vara Prasad Garu’ Shoot…
It is all known that Megastar Chiranjeevi and director Anil Ravipudi’s ‘Mana Shankara Vara Prasad Garu’ movie will hit the…
It is all known that Megastar Chiranjeevi and director Anil Ravipudi’s ‘Mana Shankara Vara Prasad Garu’ movie will hit the…
పెరిగిన ఆర్టీసీ చార్జీలు… భరించలేమంటున్న ప్రజలు
హైదరాబాద్ నగరంలో ప్రయాణించే సిటీ బస్సుల్లో చార్జీలను పెంచుతూ ఆర్టీసి నిర్ణయం తీసుకున్నది. కనీస చార్జీలపై 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రజలు…
హైదరాబాద్ నగరంలో ప్రయాణించే సిటీ బస్సుల్లో చార్జీలను పెంచుతూ ఆర్టీసి నిర్ణయం తీసుకున్నది. కనీస చార్జీలపై 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రజలు…
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్…
తెలుగు సినిమా పరిశ్రమ కి సెప్టెంబర్ నుంచి గోల్డెన్ కాలం నడుస్తుంది… మిరై, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, OG ఇలా అన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి……
తెలుగు సినిమా పరిశ్రమ కి సెప్టెంబర్ నుంచి గోల్డెన్ కాలం నడుస్తుంది… మిరై, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, OG ఇలా అన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి……