24/06/2026
Union Budget Reflects Public Aspirations, Strengthens Atmanirbhar Bharat Andhra Pradesh Health Minister Satyakumar

Union Budget Reflects Public Aspirations, Strengthens Atmanirbhar Bharat Andhra Pradesh Health Minister Satyakumar

ప్రజల మనోభావాల అనుగుణం గా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యప్రసాద్ యాదవ్ సోమవారం అన్నారు. విజయనగరంలో సమాచార శాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ దేశ సుస్థిర అభివృద్ధి కొరకు ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ నిర్మాణానికి పునాదులు ఈ వేసేదిశగా బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు.

మూడు కర్తవ్యాలను గుర్తుచేస్తూ దేశ ఆర్థికవ్యవస్థను ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందన్నారు. ప్రజల మనోభావాలు ఆకాంక్షలకు అనుగుణం గా వారి సామర్థ్యాలను పెంచేదిశగా ఉందన్నారు. ప్రధాని ఆలోచనలో పుట్టిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ద్వారా అందరికీ ఆర్ధిక ఫలాలు అందించే దిశగా బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.తయారీ రంగం లో ఊతమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ లో సెమీకండక్టర్ పరిశ్రమకు 14000 కోట్ల వ్యయంచేయడం వలన దేశం సెమీకండక్టర్ హబ్ గా అవతరిస్తుందన్నారు.

అదేవిధంగా రేర్ ఎర్త్ మినరల్స్ , బుల్క్ డ్రగ్ పార్క్, బయో ఫార్మా శక్తి రంగాల్లో పురోగతి సాధించడానికి బడ్జెట్ దోహదం చేస్తుందని అన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేదిశగా 15000 వేల పాఠశాలల్లో ల్యాబ్స్ ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. దేశం లో ప్రవేశపెట్టనున్న ఐదు మెడికల్ టూరిజం హబ్ లలో ఆంధ్రప్రదేశ్ ఎంపిక అయినట్లు చెప్పారు. ఐటీ రంగం లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ బడ్జెట్ లో పెద్దయెత్తున ప్రణాళిక చేసినట్లు వివరించారు. దేశం లో మౌలిక సదుపాయాలు కల్పన అందించేందుకు పి ఏం గతిశక్తి పథకం క్రింద నూట పదకొండు లక్షల కోట్ల వ్యయం తో హై స్పీడ్ రైల్వే కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

BHEL Chat Mission
BHEL Chat Mission


పోర్టుల అభివృద్ధి, ప్రత్యేక వాయు రవాణా కారిడార్ ఏర్పాటు, ఎనర్జీ రంగం, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించినట్లు చెప్పారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కోసం ప్రత్యేకంగా పట్టణ ఆర్థిక మండలి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్ధిక స్వావలంబన కొరకు 670 మండలాల్లో ఇరవైలక్షల ఆర్థిక ప్రోత్సాహకం తో షీ మార్టు లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జి రామ్ జి పథకం కోసం ఈ బడ్జెట్ లో తొంభై ఆరు వేల కోట్లు రూపాయిలు మంజూరు చేసినట్లు వివరించారు.

వ్యవసాయ రంగం లో అధిక విలువ ఉత్పత్తుల ఎగుమతుల వల్ల ఆర్ధిక పురోగతి సాధిస్తుందని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎప్. ఆర్. ఐ, సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మన గౌరవ ప్రధాన మంత్రి విజన్ 2047 లక్ష్యం గా ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఎం ఎస్ ఎం ఈ ఏర్పాట్ల కోసం అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈక్విటీ సపోర్ట్ అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారు. సుమారు పదివేల కోట్ల రూపాయలను దీనికి కేటాయిస్తూ ‘సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్’ అని NSIC (నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కార్పొరేషన్) ద్వారా ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏదైతే ఉందో MSME ఇండస్ట్రీస్‌కి పెద్ద ఎత్తున సహకారం చేయడానికి ఒక కొత్త ప్లాట్‌ఫారమ్ ఎస్టాబ్లిష్ చేయడం సంతోషదాయకమన్నారు.

Also Read  జనసేన జనరల్ బాడీ సమావేశం లో తీసుకున్న మొదటి తీర్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *