మునగకాయను తినమంటే జుర్రుకొని తినేస్తాం…కానీ మునగాకు అంటే వామ్మో…మహాచేదుగా ఉంటుంది బాబోయ్ వద్దే వద్దూ అంటారు. కానీ, మునగాకులో ఆరోగ్యాన్ని అందించే పోషకాలు ఎన్నో ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి ఈ మునగాకు చేసే మేలు అంతాఇంతా కాదు. ఒకవేళ ఈ ఆకును నేరుగా తీసుకోలేని వారు దానిని ఎండబెట్టి పొడిచేసి అందులో గుమ్మడి గింజలు, పిస్తాగింజలు, కొబ్బరిపొడి, కిస్‌మిస్, యాలుకలను వేసి పొడిగా చేసి లడ్డూలా చేసుకొని తినేయండి. ఇలా చేయడం వలన జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. మునగాకులో ఉండే విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్, అమైనో యాసిడ్స్, జింక్, ఐరన్, క్యాల్షియం, కాపర్, పొటాషియం, మెగ్నిషియం వంటి మూలకాలు జుట్టును ఆరోగ్యవంతంగా మార్చడంలో సహకరిస్తాయి. గోళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ మునగాకు తప్పనిసరి.
సో, మునగాకును కూరగా తీసుకోలేనివారు ఇలా లడ్డూలు చేసుకొని తినాలి. మునగాకు పొడిని కూరల్లో కలుపుకొని అయినా తీసుకోవచ్చు. వారానికి ఒక్కసారి మునగాకును ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన శరీరం కంట్రోల్‌లో ఉంటుంది. ఆరోగ్యం అదుపులో ఉంటుంది. బద్దకం వదిలిపోతుంది. జుట్టురాలిపోవడం తగ్గిపోతుంది. చుండ్రు పారిపోతుంది. ఎముకలు పుష్టిగా మారతాయి. మెటబాలిజం రేటు పెరిగి వృద్ధాప్యం నుంచి దూరంగా ఉండొచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న మునగాకు కాస్త చేదుగా ఉంటే ఏంటి? కళ్లుమూసుకొని తినేస్తే పోలా… ఏమంటారు.