బంగారాన్ని దొంగలించటము, మద్యం సేవించటము, బ్రహ్మ హత్య, గురుపత్నితో సరసము, ఈ నాలుగు పాపాలను చేసేవారితో స్నేహం. ఇవి పంచ మహాపాతకములు. చూసారా దుష్టులతో సాంగత్యం కూడా మహ పాతకం అన్నమాట.
దేవతల వాహనములు ఏమిటి?
గంగానదీ దేవికి మొసలి
యమునా నదీ దేవికి తాబేలు
ఇంద్రునకు ఐరావతము
చంద్రునకు వాయుదేవునకూ లేడి
శివునికి వృషభము
సూర్యుడునకు ఏడు అశ్వాలు పూన్చిన రథం
శనికి కాకి, గ్రద్ధ
లక్ష్మీదేవికి గుడ్లగూబ
రతీ మన్మథులకు చిలుక
బ్రహ్మ, సరస్వతులకు హంస
పార్వతీదేవికి సింహము
అమ్మవారికి సింహం, పెద్దపులి
హనుమంతునకు ఒంటె
పెళ్ళయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత ఆకాశం వైపు పెళ్ళి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసార జీవనం సుఖమయంగా కొనసాగుతుందని పండితుల నమ్మకం. మాఘ మాసం, పంచమాసాలకాలం తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కనబడదు.
రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటంవల్ల కంటి శక్తి పెరుగు తుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత బలపడుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున ఈ నక్షత్రం కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వైపు చూడండి. ‘?’ మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది.