బ్లాక్ గోల్డ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది మిరియాలు. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. వీటి ధర అధికంగా ఉండటంతో వీటిని ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. బొప్పాయి విత్తనాలను ఎండబెట్టి వాటిపై చీప్ ఆయిల్ లేదా సీసం పూసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఇలాంటి వాటి వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. మిరియాలు మంచివా లేక నకిలీవా అని ఖచ్చితంగా కనిపెట్టాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని టిప్స్ ఫాలో కావాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొక్రోవ్‌స్క్‌లో ఉద్రికత్తలు…ఉక్రెయిన్ స్పై డ్రోన్ కూల్చివేత
ఓరిజినల్ మిరియాలైతే గట్టిగా నొక్కితే పగిలిపోవు. చాలా గట్టిగా ఉంటాయి. అదే బొప్పాయి గింజలు కలిపిన మిరియాలైతే వెంటనే పగిలిపోతాయి. నకిలీవో కాదో కనిపెట్టడానికి ఇదో ప్రాథమిక పరీక్ష. ఇక మరో సులభమైన పరీక్ష కూడా ఉంది. గ్లాసు నీళ్లల్లో చెంచాడు మిరియాలు వేసి చూడండి. మంచి మిరియాలైతే ముగినిపోతాయి. కానీ, నకిలీ మిరియాలైతే పైకి తేలుతాయి. మిరియాలను గట్టిగా చిదిమినపుడు వాసన వస్తుంది. మంచి మిరియాలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. అదే మిరియాలు వాసన రాకుంటే నకిలీవి అన్నమాటే. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో లేదా ఇంటికి తెచ్చుకున్నాక తప్పకుండా ఈ పరీక్షలు చేసి చూడండి. అంతేకాదు మిరియాలను నూరి నీటిలో పోసి మరిగించినపుడు ఘాటు వస్తుంది. ఇలా ఘూటు వస్తే అవి మంచివి లేదంటే నకిలీవే. నకిలీ అని తెలిస్తే వెంటనే ఫసాయ్‌కి తెలియజేయడం ఉత్తమం.