ఒంటిమిట్టకు ఆపేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా. ఇద్దరు దొంగలు ఈ ఆలయాన్నినిర్మించినట్టుగా మీకు తెలుసా? కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట ఆలయాన్ని దొంగతనం చేయడానికి వచ్చిన ఓ ఇద్దరు దొంగలు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతున్నది. ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దు దొంగలు గ్రామాన్ని దోచుకునేందుకు వచ్చి గుట్టపై నిద్రపోయారట.

వారికి కలలో శ్రీరామచంద్రుడు కనిపించి తానున్న చోటు చూపి తనకు గుడి కట్టాలని ఆదేశించారట. దొంగలు తాము దోచుకున్న ధనంతో రాములవారికి గుడిని నిర్మించారు. అదే ఒంటిమిట్ట. ఇక్కడ విశేషమేమంటే… ఒంటిమిట్టలోని కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలను జాంబవంతుడు స్వయంగా ప్రతిష్టించారని చెబుతారు.

ఈ ఆలయం మొత్తంలో ఎక్కడ వెతికినా మనకు ఆంజనేయుడి విగ్రహం కనిపించదు. త్రేతాయుగంలో నిర్మించిన జాంబవంతుడు ఇక్కడ సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించగా… కలియుగంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం దొంగలు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇదే ఒంటిమిట్ట రహస్యం.