అరచేతిలో కనిపించే గీతలను ఆధారం చేసుకొని వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును, ఆర్థిక స్థితిని, వైవాహిక జీవితాన్ని అంచనా వేయవచ్చు. హస్తసాముద్రిక శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది మనకు అవగతం అవుతుంది. అరచేతిలో ముఖ్యంగా కుడి అరచేతిలో కనుక కొన్ని క్రాస్ లేదా అడ్డగీతలు ఉంటే అవి మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాయనడంలో సందేహం లేదు. మీ అరచేతిలో ఉండే ఆ గీతలకు అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరచేతిలో బ్రహ్మగీతమీద క్రాస్ గీత ఉంటే మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని దివ్యశక్తులను మీరు సొంతం చేసుకుంటారు. హార్ట్‌లైన్ మీద క్రాస్ గీత ఉంటే ప్రేమలో తీవ్రమైన అనుభవాలను చవిచూస్తారని, ఎమోషనల్‌గా పలు ఛాలెంజెస్‌ను స్వీకరించాల్సి ఉంటుంది అనడానికి సంకేతం.
ఇంట్లో చిన్నారులు పదేపదే ఏడుస్తుంటే…దేనికి సంకేతం
చూపుడు వేలును మౌంట్ ఆఫ్ జూపిటర్ అని కూడా పిలుస్తాం. ఈ వేలు కింద క్రాస్ గీతలు ఉంటే మీరు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అంతేకాదు, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభయోగం మిమ్మల్ని వరిస్తుంది. ఈ క్రాస్‌లైన్స్ అదృష్టాన్నే కాదు..కొన్ని సందర్భాల్లో దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. చేతి మధ్యభాగంలో అనేక క్రాస్‌లు ఉంటే జీవితంలో అడ్డంకులు ఎదురౌతాయి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. లైఫ్‌లైన్ మీద క్రాస్ గీతలు ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫేట్‌లైన్‌మీద క్రాస్ గీతలు ఉంటే చేపట్టిన వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.