ఈ రోజు స్మార్త,మాధ్వ నిర్జల ఏకాదశి. భీమ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణము ప్రకారం, పాండవులలో రెండవవాడు అయిన భీముడు మంచి తిండి పుష్టి కలవాడు,ఆకలికి తాళలేని వాడు. ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశీ అందరూ ఉపవాసం ఉంటుంటే, ఆకలికి తాళలేక తాను మాత్రం ఉండేవాడు కాదుట. గమనించిన వేద వ్యాసుడు, సంవత్సరంలో వచ్చే , 24 ఏకాదశీ ఉపవాసాలు ఆచరించక పోయినా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండమని, ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే… సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఉన్న ఫలితం ఉంటుందని భీమసేనుడుకి నచ్చచెప్పి, ఉపవాసం ఉండేలా చేసాడుట. అందుకని ఈ ఏకాదశిని భీమసేనీ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. కాబట్టి సంవత్సరంలో వచ్చే అన్నీ ఏకాదశీ ఉపవాసాలు ఉండలేని భక్తులు కనీసం ఈ నిర్జల ఏకాదశీ ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన, సంవత్సరంలో అన్నీ ఏకాదశీ వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుంది అని నమ్మకం. ద్వాదశి హరి వాసరం రేపు ప.11.25 వరకూ ఉన్నందువలన ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు మ.01.34 నుండి సా.04.12 వరకూ ఉంటుంది.
Related Posts

మనిషి ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తే… ఎలాంటి విజయాలు సాధించగలడో తెలుసా?
ఈ ఆధునిక యుగంలో విజయం అంటే ఎక్కువ మంది ధనం, పదవి, పేరు ప్రతిష్ట వంటి విషయాలను మాత్రమే చూస్తారు. కానీ ఇవన్నీ ఒక్క సారి మనకి…
ఈ ఆధునిక యుగంలో విజయం అంటే ఎక్కువ మంది ధనం, పదవి, పేరు ప్రతిష్ట వంటి విషయాలను మాత్రమే చూస్తారు. కానీ ఇవన్నీ ఒక్క సారి మనకి…

ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరుని సేవల వివరాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రోజున జరిగే సేవలు భక్తులను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ఈ రోజు, విశేషమైన భక్తి భావనతో ఆలయం వెలుగులతో…
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రోజున జరిగే సేవలు భక్తులను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ఈ రోజు, విశేషమైన భక్తి భావనతో ఆలయం వెలుగులతో…

అష్టోత్తర శతనామావళి పఠించేముందు పాటించవలసిన నియమాలు
మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా…
మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా…