తుమ్మిపువ్వులు గడ్డిజాతికి చెందిన మొక్కలు. సాధారణంగా ఇవి రోడ్డు పక్కన, పొలం గట్లమీద పెరుగుతుంటాయి. వీటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఈ పువ్వులు మహాశివుడిని అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు. ఈ తుమ్మి పువ్వులను భూతనాశక అని పురాణాలు చెబుతున్నాయి. ఇది చెడు శక్తులను తొలగించే శక్తి కలిగి ఉందని విశ్వాసం. ఈ పువ్వుల పేరుమీదగానే శివుడిని భూతనాధుడు అని పిలుస్తారు. భూతగణాలకు ఆయన అధిపతి. తుమ్మి పువ్వులు భూతగణాలను ప్రసన్నం చేస్తాయని, అందువలన శివుడి ఆరాధనలో వీటిని ఉపయోగిస్తారు. తుమ్మిచెట్టు శరీరాన్ని శుద్ధి చేసే తత్వాన్ని, రోగనాశనం చేసే గుణాలను కలిగి ఉంటుంది. మహాశివుడు శుద్దతకు ప్రతీక. అందుకే ఈ పువ్వులు శివారాధనలో తప్పకుండా ఉపయోగించాలని అంటారు. శివుని పూజలు తుమ్మి పువ్వులను సమర్పించడం వలన దోషాలు తొలగిపోతాయి. చేసిన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. అలంకరణ తత్వం లేని భగవంతుడు మహాశివుడు. అందుకే చిన్నదైన, సాధారణమైన తుమ్మిపువ్వును మహాశివుడిని శ్రద్ధతో సమర్పిస్తే ఆయన తృప్తి చెందుతారని, భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ఒక్క తుమ్మిపువ్వుతో శివుడిని పూజిస్తే సహస్ర పుష్పార్చన చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Related Posts
Food మనిషికి ఎందుకు అవసరం? శక్తి, ఆరోగ్యం, జీవన రహస్యాలు
కూటి కోసమే కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఏ పనిచేసినా చేతివేళ్లు నోట్లోకి వెళ్లేందుకే. మనిషికి ఆకలంటూ లేకుంటే ఏ పని చేయకుండా హాయిగా ఉండిపోతాడు. కానీ,…
కూటి కోసమే కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఏ పనిచేసినా చేతివేళ్లు నోట్లోకి వెళ్లేందుకే. మనిషికి ఆకలంటూ లేకుంటే ఏ పని చేయకుండా హాయిగా ఉండిపోతాడు. కానీ,…
బండ్ల గణేష్ ఇంట్లో మెగా దీపావళి సెలెబ్రేషన్స్
Post Views: 31
Post Views: 31
ధనుష్ తో మృణాల్ పెళ్లా???
ధనుష్ ఇంకా మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.…
ధనుష్ ఇంకా మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.…