మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. మంచి ఇల్లు కట్టుకోవాలి. అందమైన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంట్లో సుఖంగా ఎలాంటి కలతలు లేకుండా ఇబ్బందులు రాకుండా ఉండాలని ఉంటుంది. ఆ కలతోనే ఇంటిని నిర్మించుకుంటాం. దానికోసం ఇంటి నిర్మాణం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. వాస్తు నియమాలు పాటిస్తూ ఇంటిని కట్టుకుంటాం. కానీ, ఎంత ఖచ్చితంగా నియమాలు పాటించినా ఎక్కడో ఒక చోట పొరపాటు జరగడం సహజమే. కొంతమంది వాస్తు నియమాలను సరిగ్గా పట్టించుకోకుండా ఇల్లు నిర్మిస్తుంటారు. ఇలా నిర్మించిన ఇల్లు కొన్నాళ్ల తరువాత సమస్యలు ఎదుర్కొంటారు. కొంతమంది మొండిగా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. అయితే, ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపిస్తే ఆ ఇంటిని తప్పకుండా వదిలిపెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వదిలేయకుంటే ఇంట్లో కీడు సంభవిస్తుంది, మరణాలు సంభవించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇంట్లో సూర్యరర్మి సరిగా పడకుండా ఉండటం లేదా అసలు సూర్యరర్మినే పడకుండా ఉంటే వీలైనంత త్వరగా ఆ ఇంటిని విడిచిపెట్టాలి. అలా కాకుండా ఆ ఇంట్లోనే ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు తప్పకుండా ఇంటిని వదిలివేయాలి.
ఇంట్లో వెంటిలేషన్ సరిగా ఉండకుండా ఉన్నా, పదేపదే ఇంట్లో బూజు పడుతుంటే, ఇంత క్లీన్ చేసినా బూజు వస్తూనే ఉన్నా ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఆవాసం చేసుకున్నాయని అర్ధం చేసుకోవాలి. అటువంటి ఇంటిని వీలైనంత త్వరగా వదిలేయాలి. ఇంట్లో బల్లులు ఉండటం సహజమే. ఒకటి రెండు బల్లులు ఉంటే మంచి శకునం అని చెబుతాం. ఇలాంటి శక్తులు ఇంట్లో ఉండటం అనుకూలం. కానీ, అంతకు మించి బల్లులు ఇంట్లో ఉండటం అశుభం. ఎక్కువ బల్లులు ఉంటే ఇంటికి మంచిదికాదు. ఇంట్లో ఎక్కువగా బల్లుల శబ్దం వస్తుందో ఆ ఇంట్లో అస్సలు ఉండకూడదు. అలా ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. ఎక్కువ కాలం ఉంటే ఇంటి యజమానికి మంచిదికాదు. బల్లులు చెదలను ఆకర్షిస్తాయి. ఒక్కసారి చెదలు ఇంట్లోకి రావడం మొదలుపెడితే ఆ ఇల్లు త్వరగా పాడుబడిపోతుంది. కాబట్టి అటువంటి ఇంటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. చెదలు పట్టిన ఇల్లు చెడు శక్తులకు ఆవాసాలు. అంతేకాదు, భూమిలో బొగ్గు కనిపించినా, ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీసిన సమయంలో ఎముకలు కనిపించినా… అక్కడ ఇంటిని నిర్మించకుండా ఉండటం మేలని పండితులు చెబుతున్నారు. అంలేకాదు, భారీగా ముళ్ల కంచెలు ఉన్న ఇంట్లో కూడా మనుషులు నివశించరాదు ముళ్లచెట్లు ఉన్న ప్రాంతంలోనూ ఇంటి నిర్మాణం చేపట్టకూడదని పండితులు చెబుతున్నారు.
వాస్తు నియమాలు తప్పని సరిగా పాటించాలి. వాస్తు నియమాలతో పాటు ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. బల్లులు ఎక్కువ లేకుండా, బూజు పట్టకుండా, చెదలు పట్టకుండా, సూర్యరర్మి ప్రసరించేలా చూసుకోవాలి. ఎవరైతే ఈ నియమాలను పాటిస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో వారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.