రథసప్తమి అనే పేరు ఎలా వచ్చింది?

Why Is Rathasapthami Celebrated? Significance, Mythology and Scientific Meaning Explained

పురాణాల ప్రకారం, మాఘ శుద్ధ సప్తమి అశ్విని నక్షత్రం ఆదివారం రోజున సూర్య భగవానుడు అదితి, కశ్యప ప్రజాపతులకు జన్మించాడు. అంటే ఇది సూర్య జయంతి. ఈ రోజునే సూర్యుడు తన సప్త అశ్వములు (ఏడు గుర్రాలు) పూన్చిన బంగారు రథంపై తొలిసారిగా సంవత్సర కాల గతి నక్షత్రాత్మక రాసి చక్రంలో తన ప్రయాణం ప్రారంభమైంది. అందుకే దీనిని ‘రథసప్తమి’ అంటారు. సూర్యుడు మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అయితే, రథసప్తమి నాటికి సూర్యుని గతి పూర్తిగా ఉత్తరం వైపుకు తిరిగి, వేగాన్ని పొంచుకోవటానికి సప్తాశ్వాలు సిద్ధమయ్యే సమయం ఇది. సూర్య రథం దక్షిణం నుండి ఉత్తరానికి తిరగడం అంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమిపై పడే కోణం మారడం. ఈ రోజు నుండి పగటి కాలం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల వాతావరణంలో వెచ్చదనం పెరిగి, చలి తగ్గుతుంది. రథసప్తమి అనగా కాలగమనానికి ప్రతీక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *