ఆక్సిజన్, కార్బన్ డైయాక్సిడ్ లతో పాటు శరీరం లో ఉన్నం ప్రాణం, శ్వాసను బయటకు పోకుండా, బ్రూ స్థానంలో నిలిపేదే ప్రాణాయామం, దాన్నే యోగం అని శ్రీ స్వామి అంతర్ముఖానంద ప్రవచించారు. ఏపీలో విజయవాడ భవానీపురం లో శ్రీ స్వామి రామానంద పరమహంసల వారు మొట్టమొదట స్థాపించిన ఆశ్రమం లో ప్రముఖ ఇంజనీర్, ఆశ్రమ శిష్యులు అయిన తెనాలి సుబ్బారావు నిర్మించిన గెస్ట్ హౌస్ ను శ్రీగురూజీ ప్రారంభించారు.
ఈ సందర్బంగా హాజరైన శిష్యులనుద్దేశించి శ్రీగురూజీ మాట్లాడుతూ ఉచ్వాస, నిశ్వాసలను రాపిడి చేయడమే ప్రాణాయామం అని అన్నారు. ఈ రెండింటితో దేహంలో అంతర్లీనంగా ప్రాణం ఉందని దాన్ని బ్రూ స్థానంలో నిలపడమే ప్రాణమన్నారు. వేదవేదాంగాలలోను, మహాయోగులు చేసిన, చూపిన మార్గమే ఇదని శ్రీగురూజీ స్పష్టం చేశారు. యోగి వేమన, మహా అవతార్ బాబా, పరమహంస యోగానంద, మన గురుదేవులు శ్రీ స్వామి రామానంద పరమహంసలు దీన్నే అందరికీ ఉపదేశంగా ఇచ్చారని శ్రీగురూజీ అన్నారు. అంతకుముందు శ్రీగురూజీ ఆశ్రమంలో ఉన్న అలనాటి శ్రీ స్వామిజీ పాదుకలను తన శిరస్సు పై పెట్టుకుని గెస్ట్ హౌస్ లోకి అడుగు పెట్టి దాన్ని ప్రారంభించారు. వారితో పాటు శిష్యులు తెనాలి సుబ్బారావు, ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వ ఉద్యోగి శతృఘ్నకుమార్, నాగమల్లి, రెడ్డి తదితర శిష్యులు పాల్గొన్నారు. ప్రముఖ పల్మనాజిస్ట్, కరోన సమయంలో డాక్టర్ గా పలువురు సేవ చేసి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న, శ్రీగురూజీ ప్రియ శిష్యుడు డా. సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు.