ధీరజ్ కొత్త సినిమా ‘సమ్మర్ హాలిడేస్’…

Dheeraj Mogilineni Announces Children’s Film Summer Holidays After Couple Friendly Success

‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని ఇప్పుడు మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఆయన నిర్మించిన ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా మంచి పేరు సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సమ్మర్ హాలిడేస్ అనే కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

చిన్నారుల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఈ రోజు అధికారికంగా టైటిల్ ప్రకటించారు. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే కథతో దర్శకుడు శ్రీకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో మాస్టర్ రోహన్ రాయ్ ఇంకా మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రోహన్ రాయ్ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, అరుణ్ కూడా తన గత చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ కొత్త సినిమా వీరిద్దరికీ మరింత మంచి పేరు తీసుకురావడం ఖాయమని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

సమ్మర్ హాలిడేస్ సినిమా మే 1న ఘనంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వినోదంతో పాటు ఎమోషన్స్ ఉన్న ఒక అందమైన ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు మాత్రమే కాదు, కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సున్నితమైన కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read  Niranjan And Arjun's Seetha Payanam (Telugu) Pre-Release Event LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *