సత్య దేవ్ కొత్త సినిమా లాంచ్

Satyadev’s 15th Film Launched with Anil Ravipudi’s Clap in Hyderabad

టాలీవుడ్ పాపులర్ హీరో సత్యదేవ్ కొత్త సినిమాను ఈరోజు ఆఫీసియల్ గా లాంచ్ అయ్యింది. ఇది ఆయన కెరీర్‌లో ఇది 15వ చిత్రం కావడం ప్రత్యేకం. ఈ సినిమాను త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మాత బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. పూర్తి వినోదాత్మక కథతో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అలాగే ఇందులో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్‌లపై క్లాప్ కొట్టి చిత్రానికి శుభారంభం చేశారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మంచి కథతో ప్రేక్షకులను అలరించే సినిమా అందించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే షూటింగ్ పూర్తి వివరాలు మరియు ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ లాంచ్ ఈవెంట్ వీడియో ని కూడా సోషల్ మీడియా లొ షేర్ చేసారు…

Also Read  భార్య ని గుర్తు చేసుకున్న ఉత్తేజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *