Native Async

బాలయ్య అఖండ 2 గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం…

Akhanda 2 Censor Done with U/A – Balakrishna’s Three Powerful Avatars Ready to Roar This December 5th
Spread the love

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ ఇప్పుడు రిలీజ్ కి గ్రాండ్ గా సిద్ధం అయ్యింది. సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యి U/A సర్టిఫికెట్ రావడం వల్ల ఇంకా హైప్ పెరిగింది. సినిమా ఫైనల్ ప్రింట్ ఇండియా ఇంకా ఓవర్సీస్ థియేటర్లకు ఇప్పటికే చేరడంతో ఇక చివరి నిమిషం డ్రామాలే లేవనేది క్లియర్ అయింది.

2 గంటలు 44 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్న ఈ చిత్రం పూర్తి పేస్‌తో నడిచే హై-ఆక్టేన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తయారైనట్టు సమాచారం. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతలు ఇప్పటికే భారీ లాభాల్లో ఉన్నారు. బజ్ ఇలా ఉండటంతో బాక్సాఫీస్ రికవరీ కూడా ఈజీగా పూర్తవుతుందనే నమ్మకం ట్రేడ్ సర్కిల్స్‌లో కనిపిస్తోంది.

బోయపాటి శ్రీను తన సిగ్నేచర్ స్టైల్‌లో, ఇంకా మరింత కేర్‌తో బాలయ్య క్యారెక్టర్‌ని డిజైన్ చేశారనే మాట వినిపిస్తోంది. ‘అఖండ 2’ కథ, మొదటి పార్ట్‌కు కొనసాగింపుగానే సాగినా… ఇక్కడ స్టోరీటెల్లింగ్‌లో యాక్షన్, ఎమోషన్, ఆధ్యాత్మికత అన్నింటినీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో మిక్స్ చేశారట.

ఇక సినిమా లో ఎమోషనల్ స్టోరీ లైన్ గురించి మాట్లాడితే, ట్రైలర్ లో చుసిన దాని ప్రకారం ఇద్దరు బాలయ్య లు ఉంటారు… ఒకరు తల్లి తో ఉంటె, ఇంకొకరు శివయ్య కోసం శివయ్య తో ఉండే అఘోరి… ఫస్ట్ పార్ట్ లో అతను తల్లి ని ఫామిలీ ని, తమ్ముడి కూతుర్ని కలవడం చూసాం… ఇక సెకండ్ పార్ట్ లో కూతురు మళ్ళి పెద్దనాన్న ని పిలవడం ఇంకా తల్లి కూడా తన అంతిక్రియలు పెద్ద కొడుకే చేయాలి అని పట్టుపడడం తో అఘోరి మళ్ళి జనం లోకి వచ్చి విలన్ అది పినిశెట్టి పని పడతాడు…

దానితో పాటు సనాతన హైందవ ధర్మ విలువలను డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తుందని ఇన్‌సైడర్‌లు చెప్పే వార్త. అదీ కాకుండా, షాకింగ్ ట్విస్టులు, పవర్‌ఫుల్ మోమెంట్స్, గూస్‌బంప్స్ ఇచ్చే ఫైట్ సీక్వెన్స్‌లు ఈసారి మరింత యూనిక్‌గా ఉండబోతున్నాయట. ముఖ్యంగా—చిత్రంలో లార్డ్ శివుడి అవతారం పెద్ద సర్ప్రైజ్‌గా నిలుస్తుందన్న హింట్ బజ్‌ను ఇంకా పెంచేస్తోంది.

ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించబోతున్నారు. అందులో అఖండ రూపం ఈసారి మరింత శక్తి, మరింత ఆధ్యాత్మిక ధాటితో ప్రేక్షకుల్ని ఆవహించబోతోందని టీమ్ నమ్మకం. NBK – బోయపాటి కాంబినేషన్‌కి ఉన్న రెస్పెక్ట్… దానికి తోడు వచ్చి చేరిన ఈ ప్రమోలు కలిపి సినిమాపై అద్భుతమైన హైప్‌ని క్రియేట్ చేశాయి.

సెన్సార్ అధికారులు కూడా—ఈ సినిమాలో ఉన్న డివోషన్, డ్రామా, యాక్షన్ మిక్స్‌ను చాలా పొగిడారట. ఆధ్యాత్మికతతో పాటు ఎమోషన్‌ను కోర్‌లో ఉంచుకుని చేసిన ఈ ఎఫర్ట్ వాళ్లను ఇంప్రెస్ చేసిందట.

ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. టికెట్లు లైవ్‌లోకి వచ్చి బుక్ మై షోలో No.1 ట్రెండింగ్‌గా మారింది. రేపు ప్రీమియర్‌షోలు స్టార్ట్ అవుతుండటమే మేకర్స్ కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. ఇప్పుడు బాలయ్య శక్తి థియేటర్లను ఎంతలా షేక్ చేస్తుందో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit