మన అందరికి ఈటీవీ WIN లో వచ్చిన 90s మిడిల్ క్లాస్ ఫామిలీ సిరీస్ గుర్తుండే ఉంటుంది కదా… అందులో చిన్నోడు ఆదిత్య క్యారెక్టర్ ఐతే పక్క మర్చిపోలేం. చదువు ఎక్కకపోయిన కానీ తండ్రి కోసం చదువుతాడు… మరి ఇప్పుడు ఆ చిన్నోడు పెద్దయి అమెరికా కి పోతాడు ఆ సినిమా నే ‘ఎపిక్’ అనమాట…
ఆ స్టోరీ ని డెవలప్ చేసి ఆదిత్య గా ఆనంద్ దేవరకొండ ని చూపించనున్నారు… హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఇక ఆ ఇద్దరి లవ్ స్టోరీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనమాట… సినిమా టైటిల్ టీజర్ లో వైష్ణవి గ్రాడ్యుయేషన్ డే సందర్బంగా తన ఫ్రెండ్స్ తో తనకి కాబోయేవాడి గురించి క్వాలిటీస్ చెప్తుంటే, ఆదిత్య గద్దర్ వేషం లో ఎంట్రీ ఇస్తాడు… మరి ఈ ఇద్దరికీ ఎలా సెట్ అయ్యింది అనేది పెద్ద తెర మీద చూడాలి.
ఈ సినిమా ని నాగ వంశి నిర్మిస్తుంటే, 90s మిడిల్ క్లాస్ ఫామిలీ డైరెక్టర్ ఆదిత్య నే డైరెక్ట్ చేస్తున్నాడు అందుకే అంచనాలు బాగా ఉన్నాయ్!