మహేష్ బాబు అతడు సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని మూవీ ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మంచి సంభాషణలు, మహేష్ బాబు – త్రిష కెమిస్ట్రీ… ఇవన్నీ కలిసి ‘అతడు’ని చిన్నపెద్ద అందరి ఇంట్లో ఇష్టమైన సినిమాగా మార్చేశాయి.
ఫస్ట్ లో బాక్సాఫీస్ వద్ద పెద్ద మ్యాజిక్ చేయకపోయినా… TV లో మాత్రం అదిరిపోయే రేంజ్‌లో పాపులర్ అయింది. ఎంత పాపులర్ అంటే? స్టార్ మా లో 1500 కన్నా ఎక్కువసార్లు ప్రసారం అవుతూ ఓ రికార్డే సృష్టించింది. ఏ పండగ అయినా, ఆదివారం అయినా, మంచి సాయంత్రాలు బోర్ కొడ్తే… ఎప్పుడైనా టీవీ ఆన్ చేస్తే ‘అతడు’ కనిపిస్తూనే ఉండేది. ఇలా ఆ సినిమా ఒక మంచి మెమరీ లా మారిపోయింది.

కానీ ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్: ఏళ్ల తరబడి స్టార్ మా లో ప్రసారమవుతూ వచ్చిన ‘అతడు’ ఇప్పుడు ఆ ఛానల్ లో కనిపించదు. ఎందుకంటే ఇన్ని రోజుల తరవాత జీ తెలుగు సాటిలైట్ రిన్యువల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఇకపై సినిమా ప్రసార హక్కులన్నీ జీ తెలుగు చేతిలో ఉంటాయి.
జీ తెలుగు కూడా పెద్ద ప్లాన్‌తోనే సినిమా రైట్స్ కొనింది: డిసెంబర్ 14, ఆదివారం, మధ్యాహ్నం 3 గంటలకు ‘అతడు’ మొదటి ప్రసారం జరగనుంది.
ఐతే స్టార్ మా లో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న సినిమా కదా, మరి ఆ భారీ ఫ్యాన్‌బేస్ —
ఇక జీ తెలుగు వైపు కూడా అలాగే మొగ్గు చూపుతారా?
ప్రేక్షకుల స్పందన, రేటింగ్స్, ఫాలోయింగ్… ఇవన్నీ ఇప్పుడు పరిశ్రమలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ వాచ్!