గుణశేఖర్… ఈ డైరెక్టర్ సినిమాలు వస్తుందంటే, దాంట్లో ఎదో స్పెషల్ ఉంటుంది అని అందరు అనుకుంటారు కదా… అలానే అనుష్క శెట్టి తో రుద్రమ దేవి, అంతకంటే ముందు మహేష్ బాబు ఒక్కడు, చిరు మృగరాజు, సౌందర్య మనోహరం… ఈ సినిమాలన్నీ సూపర్ హిట్… కానీ తరవాత హిట్స్ రాలేదు! ఇక లాస్ట్ సినిమా సమంత తో శాకుంతలం ప్లాప్ అయ్యే సరికి ఇక గుణశేఖర్ రూట్ మర్చి, GEN Z కిడ్స్ కోసం ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీసాడు అదే యుఫొరియా. మొన్నే ఈ సినిమా రిలీజ్ అయినా కానీ, అంత పెద్ద హిట్ అవ్వలేదు. కానీ ఈ సినిమా లో మెగాస్టార్ ఒక రోల్ ఆల్మోస్ట్ చేయడానికి సిద్ధమయ్యాడని తెలుసా…
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యూఫోరియా మంచి రివ్యూస్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఐతే ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో ఒకటిగా గౌతమ్ మీనన్ పోషించిన పోలీస్ పాత్ర కథకు ప్రధాన ఆధారంగా నిలిచింది.
ఇక గుణశేఖర్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ పాత్ర కోసం మొదటగా మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. కథలోని ఆ పాత్ర లోతు చిరంజీవికి నచ్చి, మొదట ఆసక్తి చూపించినప్పటికీ, సుమారు నెల రోజుల తర్వాత ప్రత్యేక పాత్రలు చేయడానికి తాను ఇంకా సిద్ధంగా లేనని భావించి ఆ ఆఫర్‌ను వినయంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఈ విషయం బయటపడటంతో, చిరంజీవి ఈ సినిమాలో భాగమై ఉంటే ఫలితం ఎలా ఉండేదన్న చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
చిరంజీవి నటించి ఉంటే తన స్టార్ పవర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు మరింత భారీ స్థాయి ప్రేక్షకాదరణ లభించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కథలో ఉన్న ఎమోషన్, ఇంటెన్సిటీ కూడా మరోస్థాయికి చేరుకునేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో భూమికా చావ్లా ప్రధాన పాత్ర పోషించగా, తల్లిదండ్రుల బాధ్యత, డ్రగ్స్ సమస్య, విద్య ప్రాధాన్యత వంటి బలమైన సామాజిక సందేశాన్ని ఈ చిత్రం ప్రతిపాదించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఇందులోని భావం మాత్రం చర్చనీయాంశంగానే నిలిచింది.