మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతూనే ఉంది. విడుదలైనప్పటి నుంచి రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ, ఫాన్స్ ని తెగ ట్రీట్ చేస్తుంది. తాజ కలెక్షన్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ సినిమా ₹350 కోట్ల మార్క్‌ను దాటి, రీజినల్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నిర్మాతలు కూడా ఈ పెద్ద న్యూస్ సోషల్ మీడియా లో షేర్ చేసి ఫాన్స్ ని ఖుష్ చేసారు…
అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, కేవలం వసూళ్ల పరంగానే కాదు… ప్రేక్షకుల ఆదరణలో కూడా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ముఖ్యంగా BookMyShow ప్లాట్‌ఫారమ్‌లో 3.6 మిలియన్లకు పైగా టికెట్లు సేల్ అయ్యి, ఆల్‌టైమ్ హయ్యెస్ట్ టికెట్ సెల్లింగ్ రీజినల్ ఫిల్మ్‌గా MSG చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డును ఇది ఘనంగా బ్రేక్ చేసింది. ఆ సినిమా మొత్తం రన్‌లో 3.59 మిలియన్ టికెట్లు విక్రయించగా, MSG కేవలం 15 రోజుల్లోనే ఆ మార్క్‌ను దాటేయడం విశేషం.
15 రోజుల్లోనే ₹358 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఇంకా తన రన్‌ను ఆపే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రాబోయే కొన్ని వారాల్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో, థియేటర్లలో MSG ఆధిపత్యం కొనసాగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విదేశీ మార్కెట్‌లో కూడా చిరంజీవి క్రేజ్ మరోసారి రుజువైంది. నార్త్ అమెరికాలో $3.5 మిలియన్ మార్క్‌కు దగ్గరగా ఈ సినిమా పరుగులు తీస్తోంది. ఇది ఇప్పటికే చిరంజీవి కెరీర్‌లోనే కాదు, దర్శకుడు అనిల్ రవిపూడి కెరీర్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫుల్ రన్‌లో ₹400 కోట్ల గ్రాస్‌ను కూడా టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే అన్ని ఏరియాల్లో పెట్టుబడులు రికవర్ చేయడం. ఇది నిర్మాతలకు భారీ లాభాలను అందించడమే కాకుండా, మరో రికార్డును MSG ఖాతాలో వేసింది. పాన్ ఇండియా ట్యాగ్ లేకపోయినా, పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను అధిగమించడం ఈ సినిమాకు లభించిన అసలైన గౌరవం.