మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి తో చేస్తున్న మన శంకర వార ప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఆ ఫినిషింగ్ షూట్ కోసం టీం అంతా హైదరాబాద్ బిజీ గా ఉన్నారు.
అలానే ఒక పక్క షూటింగ్ ఇంకో పక్క ప్రొమోషన్స్ తో అదరగొడుతున్నారు. మొన్నే “మీసాల పిల్ల…” సాంగ్ తో వింటేజ్ మెగాస్టార్ నయన్ combo చూపించి సూపర్ అనిపించారు.
ఇక మెగాస్టార్ ని ఇందాకే మన టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ ని కూడా కలిశారు. తిలక్ ని మన శంకర వర ప్రసాద్ సెట్స్ లో కలిసిన మెగాస్టార్, ఈ కుర్ర క్రికెటర్ ని అభినందించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తిలక్ ని అభినందించి కాసేపు ముచ్చటించారు…
అలాగే పాకిస్తాన్ టీం ని మట్టికరిపించినందుకు టీం అంతా తిలక్ ని అభినందించి, సన్మానం చేసి, కేక్ కూడా కట్ చేయించారు…