తేజ సజ్జ మిరాయి సినిమా తో పాటు రిలీజైన బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపూరి సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది… సాధారణంగా మిరాయి సినిమా అంత పెద్ద బ్లాక్బస్టర్ ఐతే, దానితో పాటు రిలీజైన సినిమాలు అంత గా లెక్కలోకి రావు. కానీ కిష్కింధపూరి సినిమా కంటెంట్ తో ఇంప్రెస్స్ చేసి నిలబడింది…
ఇది ఒక హారర్ సినిమా నే కానీ, అంగవైకల్యం కన్నా మానసిక వైకల్యం ఎంత ప్రమాదకరమో చూపించింది… అలాగే శ్రీనివాస్, అనుపమ కూడా చాల బాగా నటించారు… అందుకే ఈ సినిమా మన మెగాస్టార్ చిరంజీవి కు కూడా నచ్చేసింది…
ఈ సినిమా ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి నిర్మించారు… ఈ బ్యానర్ లోనే మన మెగాస్టార్ అనిల్ రావిపూడి శంకర్ వరప్రసాద్ సినిమా నిర్మించబడుతుంది కాబట్టి, ఆ బాండ్ తో కూడా అయన సినిమా చూసి మంచి రివ్యూ ఇవ్వడం జరిగింది… ఆల్రెడీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది కాబట్టి, చిరు రివ్యూ ఒక పెద్ద బూస్ట్ ఇంకా మంచి కలెక్షన్స్ రాబట్టడానికి!