మలయాళ సినిమా సూపర్ స్టార్ మమ్మూటి కొడుకు డెకర్ సల్మాన్ మంచి మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు… ఒక్క మలయాళం ఏ కాకుండా, తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ శబాష్ అనిపిస్తున్నాడు.
ఇక తన లేటెస్ట్ సినిమా ‘కాంత’ మీద అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయ్. ఈ సినిమా 1960s లో సినిమాలు ఎలా ఉండేవో, నటులు ఎలా ఉండేవారో చూపిస్తుందంట… అలాగే రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ఇప్పుడే ట్రైలర్ అనౌన్స్మెంట్ ప్రోమో వదిలారు…
అందులో దుల్కర్ హీరో గా ఈ సినిమా నేనే చేస్తానని Samuthirakani తో చెప్పడం హైలైట్ గా ఉంది… వారిద్దరి మధ్యలో కోల్డ్ వార్ చూడబోతున్నాం అనమాట. అలాగే ఈ సినిమా లో భాగ్యశ్రీ హీరోయిన్ ఇంకా నగేష్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలు పోషించారు…
ఈ సినిమా ట్రైలర్ 6th నవంబర్ న లాంచ్ అవుతుండగా, రిలీజ్ ఏమో 14 నవంబర్… ఈ సినిమా ని దుల్కర్ సల్మాన్ తో పాటు రానా దగ్గుబాటి ఇంకా ప్రశాంత్ నిర్మిస్తున్నారు… ఇక దర్శకత్వం చేస్తున్నది సెల్వమణి సెల్వరాజ్. సో, ఓ మంచి పాత కాలం సినిమా చూడడానికి రెడీ అయిపోండి.