సుహాస్, నరేష్ ల హే భగవాన్’ టీజర్ చూసారా???

Hey Bhagawan Teaser Out: Suhas Promises Full-On Fun Entertainment

ఈమధ్య సీనియర్ యాక్టర్ నరేష్ లేని సినిమా లేదంటే నమ్మండి… ఇక సుహాస్ గురించి తెలిసిందే, మంచి రొలెస్, మంచి సబ్జెక్టు ఉన్న సినిమాలు చేస్తాడని. సో, లేటెస్ట్ గా హే భగవాన్ సినిమా తో రాబోతున్నాడు… ఈ సినిమా టీజర్ ఇందాకే లాంచ్ అయ్యింది. మరి టీజర్ ఎలా ఉందొ తెలుసుకుందామా???

వినోదానికి తోడు క్విర్కీ సర్ప్రైజ్‌లతో నిండిన ఈ టీజర్, సినిమా మీద అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ గోపి అచ్చార దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.

చిన్నప్పటి నుంచి సుహాస్ ని నువ్వు ఏమి అవుతావు అంటే, మా నాన్న business చూసుకుంటా అని అంటాడు. కానీ వాళ్ళ నాన్న ఎం చేస్తాడో తనకి తెలియదు, అది ఒక పెద్ద business అనుకుంటాడు! ఇక పెద్దయ్యాక కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో కూడా అదే చెప్తాడు… లిటిల్ హార్ట్స్ సినిమా లో మెప్పించిన హీరోయిన్ శివాని ఈ సినిమాలో కూడా హీరోయిన్… తాను చాల బాగుంది సుహాస్ పక్కన జోడి గా! ఇక ఫైనల్ గా నరేష్ ఎం బుసినెస్ చేస్తాడో తెలియాలంటే, సినిమా చూడాల్సిందే!

సుహాస్ తన సహజమైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకుంటున్నాడు. నరేష్ పాత్రకు సరైన పంచ్ ఉండేలా ఆయన నటన సాగింది. సుధర్శన్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ సినిమా నవ్వుల డోస్‌ను మరింత పెంచబోతుందని టీజర్ స్పష్టంగా చెబుతోంది. హీరోయిన్ శివాని స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎనర్జీ తీసుకువచ్చింది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందనే ఫీల్ కలుగుతుంది.

మొత్తానికి ‘హే భగవాన్’ ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. బన్నీ వాస్ వర్క్స్‌, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి మరో హిట్ లోడింగ్ అని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *