Native Async

రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Hombale Films Locks Kantara Chapter 1 Trailer Release Date
Spread the love

కేజీఎఫ్ సిరీస్, సలార్, కాంతార వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు మరో భారీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. అదే ‘కాంతార చాప్టర్ 1’. ఇప్పటికే కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన కాంతార: ది లెజెండ్ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రాబోతుండటం విశేషం.

ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి స్వయంగా రైటర్-డైరెక్టర్‌గా రూపొందించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. రిషబ్ ఇప్పటికే తన నటనతో నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. అందువల్ల ఆయన మరోసారి పెద్ద తెరపై మంత్ర ముగ్దులను చేయబోతున్నారని ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 గంటలకు ట్రైలర్ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఎంతో కీలకంగా, కొత్తగా ఉండబోతుందనే టాక్ ఉంది. సెట్ డిజైన్స్, విజువల్స్, మ్యూజిక్ అన్ని కలిపి ఈ సినిమా మరో మైలు రాయిగా నిలుస్తుందనే నమ్మకం హోంబలే ఫిల్మ్స్‌కి ఉంది.

చివరగా, ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి కాంతార చాప్టర్ 1 ట్రైలర్‌తో మొదలైన ఈ ఉత్సాహం, రిలీజ్ వరకు ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit