మౌళి లిటిల్ హార్ట్స్ మాయ ఇంకా కొనసాగుతూనే ఉంది… ఆల్రెడీ ఈరోజు తేజ సజ్జ మిరాయి 100 కోట్ల కలెక్షన్స్ దాటేసింది… పాజిటివ్ రివ్యూస్, మంచి మౌత్ టాక్ తో పాటు రిలీజ్ అయిన తర్వాత కూడా జోరుగా జరిగిన ప్రమోషన్స్ వల్ల మిరాయి సినిమా పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి రెవెన్యూ రాబడుతోంది. మరోవైపు కిష్కింధపురి టీం పూర్తిగా ప్రమోషన్స్ నిలిపేయడం వల్ల ఆ లాభం నేరుగా మిరాయి ఇంకా లిటిల్ హార్ట్స్ సినిమాలకు దక్కుతోంది.
ఇటీవల మిరాయి విజయం ఒకవైపు చర్చనీయాంశం అవుతుండగా, మరోవైపు మహేష్ బాబు లిటిల్ హార్ట్స్ గురించి చేసిన ట్వీట్ సినిమాకు పాజిటివ్ అటెన్షన్ తెచ్చిపెట్టింది. ఈ రెండు అంశాలు కలిపి సినిమాల మీద డిస్కషన్ పెంచి, పబ్లిక్ లో మరింత అవగాహన పెంచాయి.
మహేష్ బాబు సినిమా చూసి మరి ట్వీట్ చేసారు కాబట్టి, లిటిల్ హార్ట్స్ టీం బాగా సెలెబ్రేట్ చేసుకుంటుంది… అలాగే మొన్నే మధ్య జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో మ్యూజిక్ డైరెక్టర్, మహేష్ బాబు సినిమా చుస్తే ఒక వారం రోజులు ఫోన్ ఆపేసి ఎక్కడికో వెళ్ళిపోతే అని అన్నాడు… అంత ఆనందంగా ఉంటుంది అని అర్ధం… అదే చూసి, మన మహేష్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ శింజిత్ ఎర్రమిల్లి ని ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పడు…
లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ లో ఇప్పటివరకు ‘సో ఫార్ సో గుడ్’ అనే స్థాయిలో రన్ ఇస్తోంది. ఈ సినిమా కి రాబోయే రోజుల్లో కూడా డీసెంట్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా OG రిలీజ్ వరకు ఇది తన రన్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది.