మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. రామ్‌చరణ్-ఉపాసన దంపతులు కవలలకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ కుటుంబం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇటీవల మెగాస్టార్ ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకలోనే ఉపాసన శీమంతం కూడా నిర్వహించారు. రామ్‌చరణ్ కూతురు క్లీంకారకు తోడుగా మరో ఇద్దరు పిల్లలు త్వరలోనే ఆ ఇంట అడుగుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ దీపావళి మాఇంట డబుల్ వేడుకలను చేయడంతో పాటు ప్రేమను, ఆనందాన్ని డబుల్ చేసింది అంటూ ఉపాసన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
2012లో రామ్‌చరణ్ ఉపాసనల వివాహం జరగ్గా 2023లో వీరికి క్లీంకార జన్మించింది. కాగా ఇప్పుడు మరోసారి కవలలు జన్మించబోతుండటంతో వీరి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు పుట్టబోయే కవలల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే వరుణ్‌తేజ్‌కు కుమారుడు జన్మించగా… ఇప్పుడు మెగా కుటుంబంలోకి కవలలు రాబోతుండటంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆ ఆనందకరమైన క్షణాల కోసం ఎదురుచూస్తున్నది.