కొంత గ్యాప్ తరవాత టాలీవుడ్ నటుడు నవీన్ పోలిశెట్టి మళ్లీ అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా తో వచ్చే సంక్రాంతికి నవ్వుల పండగనే తీసుకురానున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే ప్రమోషన్స్ తో రచ్చ రేపుతున్నాడు.
ఇప్పుడు ఈ సినిమా మీద హీట్ ఇంకో లెవల్‌కి వెళ్లిపోయింది. ఎందుకంటే… ఫస్ట్ సింగిల్ ‘భీమవరం బాల్మా’ రిలీజ్ అయ్యింది. ఇదే పాటతో నవీన్ పోలిశెట్టి ప్లే బ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేశాడు. నవీన్ వాయిస్ తో ఈ పండగ బీట్‌కి వచ్చిన ఎనర్జీ… పాట వినగానే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుంది. బీట్ కూడా, రిథమ్ కూడా… మనల్ని ఆటోమేటిక్‌గా డాన్స్ చేసేలా చేస్తాయి.
స్క్రీన్ మీద నవీన్–మీనాక్షి జంట… పక్కా క్యూట్ కెమిస్ట్రీతో మెరిసిపోతుంది. మిక్కీ జె మేయర్ ఇచ్చిన ట్యూన్స్ అయితే వినగానే అట్ట్రాక్ట్ అయ్యేలా ఉంటాయి. చంద్రబోస్ లిరిక్స్‌లో ఉన్న ఆ ట్రెండి ఫీల్ కూడా సూపర్గా పని చేస్తుంది. నూతనా మోహన్ వాయిస్, శేఖర్ మాస్టర్ వేసిన డ్యాన్స్ మూమెంట్స్… మొత్తం కలిసిపోయి పాటను ఒక రంగురంగుల ఫెస్టివల్ సెలబ్రేషన్‌లా మార్చేశాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా… ఫస్ట్-టైమ్ డైరెక్టర్ మారి దర్శకత్వంలో రూపొందుతోంది. సంక్రాంతి గిఫ్ట్‌గా… 2026 జనవరి 14న గ్రాండ్ రిలీజ్.