Native Async

హైదరాబాద్ లో Netflix అడ్డా…

Netflix Opens New 41,000 Sq Ft Office In Hyderabad – Strengthens Focus On South Indian Content
Spread the love

హైదరాబాద్… ఒకప్పుడు ఐటీ హబ్ గా ఎదిగిన ఈ నగరం, ఇప్పుడు సినిమా, మీడియా, డిజిటల్ ప్రొడక్షన్ కేంద్రంగా ప్రపంచానికి కూడా అడ్డా అవుతుంది… ఎందుకంటే మరో అంతర్జాతీయ దిగ్గజం మన నేల లోకి అడుగుపెట్టింది… అదే Netflix! ముంబై తర్వాత భారత్‌లో రెండో ఆఫీస్ ను ఏర్పాటు చేసుకుంటూ, హైదరాబాద్లోని హైటెక్ సిటీ కాపిటాలాండ్ ITPH బ్లాక్-A లో 41 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కొత్త ఆఫీస్ ను Netflix తీసుకుంది.

ఇదే భవనంలో Warner Bros కూడా ఉండటం ప్రత్యేకం. దక్షిణ భారత మార్కెట్ పై ప్రత్యేక దృష్టితో, ముఖ్యంగా తెలంగాణ–ఆంధ్ర ప్రాంతాల తెలుగు కంటెంట్ ను ప్రపంచానికి తీసుకెళ్లాలనే Netflix లక్ష్యం ఇప్పుడు మరింత బలపడింది. RRR, బాహుబలి వంటి సినిమాలు ప్రపంచం నలుమూలల ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో, ఇక్కడి క్రియేటివ్ టాలెంట్, టెక్నికల్ స్కిల్ పై Netflix కు నమ్మకం మరింత పెరిగింది.

ఈ కొత్త ఆఫీస్ ద్వారా స్థానిక ఫిల్మ్ మేకర్స్ తో భాగస్వామ్యాలు బలోపేతం అవుతాయి, పోస్ట్ ప్రొడక్షన్, టెక్నికల్ ఆపరేషన్స్, కంటెంట్ డెవలప్మెంట్ రంగాల్లో ఎన్నో ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు — Eli Lilly, Vanguard, McDonald’s, Johnson & Johnson, P&G, Heineken, American Airlines వంటి సంస్థలు — తమ అడుగులు ఇక్కడ వేస్తుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో IMAGE Towers వంటి పెద్ద ప్రాజెక్ట్ లు రూపుదిద్దుకుంటూ, హైదరాబాద్ ప్రపంచ మీడియా & బిజినెస్ మ్యాప్ పై ప్రకాశిస్తున్నది. ఇప్పుడు Netflix ప్రవేశంతో ఈ నగరం… వినోద రాజధానిగా, క్రియేటివ్ ఫోర్స్ గా మరింత శక్తివంతం అవుతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit