అమెరికాలో గంటగంటకు పెరుగుతున్న ఓజీ మానియా

OG Movie Presale Records in America
Spread the love

ఓ పెద్ద టిప్పర్‌ లారీ వచ్చి కారును గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ సముద్రంలో కాదు…భూమిపై వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నా పవర్‌ స్టార్‌ అభిమానులు. పవన్‌ కళ్యాణ్‌ ఓ మాస్‌ పవర్‌ హీరో. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న తాను ఒప్పుకున్న వాటిని పూర్తి చేసేందుకు, అభిమానులను అలరించేందుకు సమయం దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నారు. రెట్రో గ్యాంగ్‌స్టర్‌ కథతో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఈ సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ఫొటోస్‌ అన్నీ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పవన్‌ కత్తిపట్టిన తీరు ఆయన అభిమానులను పిచ్చెక్కించేలా చేసింది. దాని ఫలితమే ప్రీ సేల్‌ రికార్డులు. ఇప్పటికే నార్త్‌ అమెరికాలో రికార్డు స్థాయిలో 9 లక్షల డాలర్ల టికెట్‌ సేల్‌ జరిగింది. పవర్‌ స్టార్‌ పుట్టిన రోజునాడు భారీ ఎత్తున ప్రీ సేల్‌ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా, అమెరికాతో పాటు ఇప్పుడు యూకేలోనూ అడ్వాన్స్‌ బుకింగ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ ఏ స్థాయిలో బుకింగ్స్‌ నమోదవుతాయో చూడాలి. సాహో ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

హరీష్‌రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు డబుల్‌ షూటర్‌ – కవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *