పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG సినిమా తెలంగాణలో చిన్న బ్రేక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ధరలు పెంచే ఆర్డర్‌ను సస్పెండ్ చేసింది.
మొదట ప్రభుత్వం ప్రత్యేక షోలు, పెంచిన టికెట్ రేట్లు అనుమతించినా… జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఆ ఆర్డర్‌ను నిలిపివేయడంతో కాస్త గందరగోళం నెలకొంది.
ఇక ఇప్పటికే పెరిగిన టికెట్ ధరలకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? రిఫండ్ ఇస్తారా? లేక డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ కోర్టు వైపు వెళ్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.
పిటిషన్ ప్రకారం చూస్తే… హైదరాబాదు పోలీస్ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకే లీగల్ అథారిటీ ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ లీగల్‌గా తప్పు అయ్యే అవకాశం ఉందని వాదించారు.
ఇక పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ లేదా కలెక్టర్లు కొత్త ఆర్డర్స్ ఇస్తే… ఇక OG సినిమా హై రేట్స్‌తోనే నడిచే ఛాన్స్ ఉంటుంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా టికెట్ సేల్స్ బలంగా జరుగుతున్నాయి. తెలంగాణలో హైకోర్టు జోక్యం కారణంగా టికెట్ హైక్ స్టాప్ అవ్వడం, అక్కడి అభిమానులకి టెన్షన్ పెంచింది.
అయినా… OG మీద ఉన్న హైప్, బజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు అభిమానులూ, డిస్ట్రిబ్యూటర్లూ ఒక క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.