మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పెద్ద తెర మీద చూడాలని చాల మందికి ఆశ కాదు… అయన ఫాన్స్ ఐతే, పవన్ ఫైట్స్, స్వాగ్ కోసం సినిమా ని మల్లి మల్లి చుసిన రోజులు ఉన్నాయ్! లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మల్లి కం బ్యాక్ ఇచ్చి, హరి హర వీర మల్లు ఇంకా OG సినిమాలు చేసాడు!
ఇక ఈ ఇయర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మనన్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు… ఇక ఈ సినిమా లో పోలీస్ రోల్ చేస్తున్నాడు కాబట్టి, ఎక్సపెక్టషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయ్!
ఐతే ఈ సినిమా ని సమ్మర్ లో రిలీస్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, ఇక డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు ఈరోజు… ఈ గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్.
అలాగే ఈ వీడియో లో డైరెక్టర్ హరీష్ తో పాటు, ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వాళ్ళు కూడా పూజ చేసి, డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేసారు. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు రాశి ఖన్నా, అశుతోష్ రాణా, ఆలీ, నవాబ్ షా, బి.ఎస్. అవినాష్, గౌతమి, చమ్మక్ చంద్ర, గిరి, నాగ మహేష్, నర్రా శ్రీను, టెంపర్ వంశీ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు! అలాగే పవన్ కళ్యాణ్ కి చాల హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్…