ప్రభాస్ లేటెస్ట్ సినిమా ‘రాజా సాబ్’ సినిమా ఫస్ట్ డే నే ప్లాప్ టాక్ తెచ్చుకుని, అతని కెరీర్ లో వీక్ సినిమా అవుతుంది అంటున్నారు. అసలు ఇంత నెగటివిటీ ని అసలు expect చేయలేదు. సో, ఇది ఒక పెద్ద మిస్తకె అవ్వబోతోంది డైరెక్టర్ మారుతి కి… ఇది పక్కన పెడితే, ఈ సినిమా ని అమెరికా లో నార్త్ ఇండియన్ రెస్టారెంట్ లో ‘ది రాజా సాబ్’ సినిమా పైరేటెడ్ వెర్షన్‌ను ప్లే చేయడం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.
ఇది చాలదు అన్నట్టు, ఇప్పుడు ఇంకో వివాదం… సినిమా లోని ‘నాచే నాచే’ పాట ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ పాట ట్యూన్ విషయంలో, తాను 2024లో రూపొందించిన ఒక మ్యూజిక్ బీట్‌ను ఈ సినిమాలో ఉపయోగించారని, అది కాపీ చేసినట్టేనని స్వీడన్‌కు చెందిన ప్రముఖ DJ విడోజీన్ ఆరోపణలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన DJ విడోజీన్, ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అందులో ఆయన, ప్రభాస్ నటనను మాత్రం హృదయపూర్వకంగా ప్రశంసించారు. “ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది” అంటూ కొనియాడుతూనే, మ్యూజిక్ విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనే రూపొందించిన బీట్‌ను అనుమతి లేకుండా వాడడం సరైంది కాదని, ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
వీడియోలో తన 2024 బీట్‌తో పాటు ‘నాచే నాచే’ పాటను పోల్చి చూపిస్తూ, రెండు ట్యూన్స్ మధ్య ఉన్న సారూప్యతను ప్రస్తావించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రెండు వైపులా వాదనలు చేస్తూ చర్చకు తెరతీశారు. కొందరు DJ ఆరోపణలకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఇది కోఇన్సిడెన్స్ మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ వివాదం నేపథ్యంలో, ‘రాజా సాబ్’ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ అంశం ఇప్పుడు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. పాట విడుదలైనప్పటి నుంచి మంచి స్పందన పొందుతున్న తరుణంలో, ఇలాంటి ఆరోపణలు రావడం సినిమా టీమ్‌కు కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా కనిపిస్తోంది.