నార్మల్ గా సినిమా ప్రమోషన్స్ అంటే సోషల్ మీడియా లో టీజర్, ట్రైలర్ పోస్టర్స్ ఇంకా ప్రీ-రిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి అనుకునే వాళ్ళం కదా… కానీ అనిల్ రావిపూడి సంక్రాంతి కి వస్తున్నాం సినిమా తో ప్రమోషన్స్ రూట్ మొత్తం మార్చేశాడు. ఇక అందరు ఇలా కొంచం డిఫరెంట్ గా ఉండాలి అని కూడా డిసైడ్ అయినట్టు ఉన్నారు…
పెద్ద హీరో సినిమా కావచ్చు… చిన్న సినిమా కావచ్చు, జనాల దృష్టిని థియేటర్ వైపు తిప్పుకోవాలంటే కచ్చితంగా కొత్త, యూనిక్ ప్రమోషన్ స్ట్రాటజీలు చాలా మస్ట్. ఈ మ్యాటర్ ని అర్థం చేసుకున్న సినిమాకారులు ఇప్పుడు కొత్త కొత్త ప్లాన్లతో ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తున్నారు. సినిమా పాటలకే కూడా వేరే లెవల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘పెద్ది’ కూడా అదే రూట్ లో దూసుకెళ్తోంది.
ఈ సినిమా టీమ్ ఫస్ట్ సింగిల్ ప్రకటించడానికి ఓ ఇంట్రస్టింగ్ సోషల్ మీడియా ప్లాన్ ఫాలో అయ్యింది. పేరూ, రిలీజ్ డేట్ కూడా చెప్పకుండా… నెట్టింట్లో ఆసక్తి రేపేలా ఓ చాట్ స్టైల్ ప్రమోషన్ చేశారు. ఇటీవల మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ లతో జరిగిన వైరల్ ట్వీట్స్ మాదిరిగానే… ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చి బాబు సనా, ఏఆర్ రెహమాన్ మధ్య జరిగిన సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పాటపై ఆసక్తి మరింత పెరిగింది.
నిన్న రాత్రి రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్ కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ…
“What’s cooking guys?” అంటూ బుచ్చిబాబు, రెహమాన్, మోహిత్ ను ట్యాగ్ చేశారు. వెంటనే రెహమాన్ స్పందిస్తూ…
“చికిరి చికిరి చరణ్ గారూ” అంటూ ట్వీట్ చేశారు. ఈ ఒక్క లైన్ తోనే ఫస్ట్ సింగిల్ పేరు అవుట్ అయిపోయింది! రెహమాన్ రిప్లైకి బుచ్చిబాబు ఫైర్ ఎమోజీ పెట్టడంతో… ఫ్యాన్స్ మూడ్ ఇంకో లెవల్ కి వెళ్ళిపోయింది.
ఈ చిన్న ట్వీట్స్ ఎక్స్చేంజ్‌తోనే సాంగ్ అనౌన్స్ చేసి, హైప్ బిల్డ్ చేయడం నిజంగా అద్భుతం. ఈ స్ట్రాటజీ సోషల్ మీడియాలో బాగా వర్క్ అయ్యింది. రెహమాన్ – మోహిత్ చౌహాన్ కాంబినేషన్ అంటే దేశమంతా ఫ్యాన్ బేసే ఉంది. వాళ్ళిద్దరూ కలిసి పాట చేసారన్న మాట వినగానే పాట కోసం పబ్లిక్ ఎగ్జైట్మెంట్ డబుల్ అయ్యింది.
“చికిరి చికిరి” అనే ఈ సోలిడ్ సాంగ్ కి జాని మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని వార్త. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ బయట పడనుంది.
ఈ భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది లో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 27, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.